[dropcap]అం[/dropcap]దమైన కొమ్మలన్ని గుబురుగా పూసిన వేళ
ఘుమఘుమలాడే పరిమళాలు కొత్త భావాలు పలికిన వేళ
అందమైన పూలపై తుమ్మెదలు వాలిన వేళ
కమ్మనైన కోయిల గొంతు మధురమైన మత్తు చిలికే వేళ
కవుల కలములన్నీ వసంత గీతాలు పాడిన వేళ
ప్రకృతిలో ప్రతిపువ్వు పరవశించి విరిసిన వేళ
తియ్యనైన మామిళ్లు మనసు దోచి మురిసిన వేళ
షడ్రుచుల విందులతో వసంతాలు విందు చేసే వేళ
పచ్చని గుమ్మాలతో ‘ఉగాది’ స్వాగతం
పలుకుతోంది వికారి నామ ఉగాది.