Site icon Sanchika

స్వాధీనత

[box type=’note’ fontsize=’16’] ఆలోక్ బోస్ బెంగాలీలో రచించిన ‘స్వాధీనతా’ అనే కవితకి కుల్‌దీప్ శర్మ హిందీ అనువాదం ఆధారంగా తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]వ[/dropcap]నితల దేహాలు ఆత్మాభిమాన రక్షణ జ్వాలల్లో (జౌహార్) దగ్ధమవుతూన్నాయి
తోడేళ్ళు అప్పుడూ మౌనంగా వున్నాయి

అక్బర్ మహానుభావుడని నేర్పించారు…
అలాంటప్పుడు అతడిని వ్యతిరేకించిన రాణా ప్రతాప్ ఎవరు?

వీధుల్లో శవాలగుట్టలు ఏర్పడుతున్నప్పుడు
మహాత్ముడు మౌనంగా వున్నాడు
మనకు స్వాతంత్ర్యం ఇప్పించింది గాంధీ అని చదువు చెప్పారు
మరి ఉరికంబాన్ని కౌగలించిన యువకిశోరాలెవరు? వారెందుకు ప్రాణాలను త్యాగం చేశారు?

గాంధీజీ పాలుతాగిన మేకను కట్టేసిన తాడు ఇంకా భద్రంగా వుంది…
ఖుదీరాం -భగత్ సింగ్‌ల ప్రాణాలు తీసిన ఆ ఉరి తాడు ఎక్కడుంది??

దేశ దుస్థితి చూస్తూ సుఖంగా నిద్రించలేను,
ముఖం నిండా ముసుగేసుకుని రోదించలేను
ఎన్నివేల జన్మలు ఉరితాళ్ళపై వ్రేలాడేయో, ఎన్ని కోట్ల ప్రాణాలు తుపాకీ గుళ్ళకు ఆవిరయ్యాయో
చరఖా స్వాతంత్ర్యాన్ని తెచ్చిందన్న అనృతం వింటూ భరించలేను.

Exit mobile version