స్వప్నలోకం

0
2

[dropcap]క[/dropcap]లల ప్రపంచం, ఇది కలల ప్రపంచం
మాయా వలల ప్రపంచం
తండ్రి, తాతల పేరు చెప్పి
లేనిపోని గొప్ప చెప్పే
తప్పలెన్నడు చేయకు
తప్పటడుగులు వేయకు.

కలలు కంటూ కలలలోనే ఉండిపోతూ
కలలలోనే తేలిపోతూ కల్లలోనే తూలిపోతూ
నిట్టనిలువుగ మునిగిపోకు.

కలలోనైన, ఇలలోనైన
లక్ష్యమన్నది పెట్టుకో
విశ్రమించక విజయమన్నది పట్టుకో.

నిన్ను గన్న మాతా పితలకు
వీడే మా బిడ్డడని చెప్పుకునే చరితనివ్వు
జన్మనిచ్చిన భరతమాతకు భవితనివ్వు.

వేదమూర్తుల, త్యాగమూర్తుల, తత్వవేత్తల
శాస్త్రవేత్తల గన్న వేద భూమిలో
నీవు వ్యర్థజీవిగ మారబోకు.

లక్ష్యమన్నది పెట్టుకో
దానిపై ఇష్టమన్నది పెంచుకో
విజయమన్నది కష్టమన్నది కాదు కాదని తెలుసుకో.

అలవిమాలిన లక్ష్యమైనా
వల్లమాలిన ప్రేమ ఉంటే ఆసాధ్యాలన్నీ
సుసాధ్యాలే సుమా

జీవితాన్ని కలలకే నైవేద్యమిడక
పట్టుబట్టీ నీ ప్రతిభనంతా వెలికి తీసి
బద్ధకాన్నీ మట్టుబెట్టి
జీవితంపై ఓ ఒట్టుపెట్టి
పట్టుదలతో భవితనంతా వెలగనీయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here