[శ్రీ మరింగంటి శ్రీకాంత్ రచించిన ‘స్వర్ణాక్షరాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]క[/dropcap]మ్మనైన అమ్మ భాష
అనురాగం ఒలికించు భాష
అక్షర రమ్యతలో మేలిమి వర్ణమాల
సాంకేతిక ప్రక్రియలో
బహు సుందరమై నిలిచె
అ, ఆ, ఇ, ఈ లు అందాల ఒలకింతలు
ఆన్‌లైనులోన
స్వర్ణాక్షరాలై పరుగులిడుచుండె
వచనమైతే నేమి, గద్యమైతేనేమి
గేయమైతేనేమి, వృత్తమైతేనేమి
ఆన్‌లైనులోన అక్షర ఝరీ ప్రవాహమయ్యె
తేనెలొలుకు భాష
తనివితీరా మాట్లాడుకునే భాష
తన్మయత్వంతో ఊగిసలాడే భాష
ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు
సుమధుర భావనా తరంగాల విద్యుల్లతలు
(లైను లైనుకూ అర్థవంతమైన పదసంపద)
లైనే జీవం, సర్వస్వం ఏ రచనకైనా
లైను తప్పిన తప్పును కదా భవిత లైను