Site icon Sanchika

స్వతంత్ర్యం వచ్చింది

[dropcap]పం[/dropcap]చసప్తతి వర్షములు గడిచినవి
స్వేచ్ఛా ఊపిరి పోసుకొని భారతావని
వేడి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ధ్వనులు
వినిపిస్తునే ఉన్నాయ్ ఇంకా కొత్తగా

ఆ వెచ్చని ఊపిరి స్పర్శలో భరతమాతకు
విగత సమరయోధుల స్మృతి వచ్చె
ఆంగ్లేయుల తూటాలు చేసిన గాయాలు
నేలకు కారిన వెచ్చటి నెత్తుటి మరకలు
అదిగో కనిపిస్తున్నాయ్……!

నాటి త్యాగమూర్తుల త్యాగఫలం
తన చేత పట్టుకొని భరతమాత
అదిగో అలా నిలుచుంది చూడు
భరతమాత కన్నులలో ఆనందం
దుఃఖం రెండూ కనిపిస్తున్నాయ్

ముద్దుబిడ్డలు పోయారన్న బాధ
స్వేచ్ఛా ఫలం దొరికిందన్న ఊరట
త్యాగాల తపస్సుతో ఊపిరి వచ్చిన
భరతమాతకు కొత్త ఊపిరి పోయాలి

గాయపడిన మాతృ హృదయానికి సాంత్వన
చేయాలి మనమంతా ఐకమత్యంగా
జాతి కుల మత భేదములు పాటించక
తల్లి మనసు నొప్పించక నడవాలి ముందుకు

భరతజాతి గొప్పదనాన్ని సంస్కృతిని
ఎలుగెత్తి చాటాలి హోరెత్తి పోవాలి
జయహో భారత మాతాకి జై….!

Exit mobile version