Site icon Sanchika

స్వీయం

[dropcap]నే[/dropcap]నొక మాటసారిని
ఆంధ్ర భాషా పిపాసిని
సుకవితాహార భోజన ప్రియ మణిని
సురస, సంభాషణాభిలాషిని
కృతి పతినెతుకు నిత్య కవిని
ఎల్లలు, కల్లలు లేని భావ ప్రకాశిని
స్వర శరీరాక్షువులు లేని అక్షర వాహినిని
భావం, భాష్యం పంచే అంతర్జాల వాసిని
మనసున్న మనిషిని, మనస్వినిని
నాకొక కొమ్మలేదు
నాదొక రెమ్మ కాదు
నాకడ వాక్పదులు తక్క వేరొండు లేదు
నేనొక విస్వ మనో విహంగ జీవిని
నవీసాంబర విహార ప్రియ శుక భామినిని
భావ కవితా మరందాల అమృత వర్షిణిని
స్త్రీ వాద వివాద నిర్వేద రహిత నిర్మల కవితా పఠనా ప్రియాంధ్ర భాషా ప్రేమిని
నాపదం ఒదిగిన అక్షరాల సౌరభం
నా పధం నవోదయ ఉషశ్శాంతి సంధ్య
నా గళం నవ నిగమ గాన భావ పంకజం
నాకంటూ ఓగళముంది
నాదైన ఒక కలముంది
నాదే అయిన ఒక గతి ఉంది
కవిగా నేనొక ప్రపంచాన్ని, ఒక ప్రకృతిని
ప్రేమ పలుకుల చిలుకని, ప్రణయ గీతికల కోయిలని
భావ ప్రకటనోద్వేగ చతురశ్వనిని
నా జీవనమొక ఋక్కు, నా జీవితమొక బుక్కు
నా వాక్కొక చమక్కు
నా వాక్యమొక తారల తళుక్కు

Exit mobile version