శ్వేత లోకంలో

    0
    6

    [box type=’note’ fontsize=’16’] “శ్వేత లోకంలో” తిరుగాడి, అక్కడి ప్రకృతినీ, మనుషులని అబ్బురంగా చూస్తూ, స్వేచ్ఛాలోకపు పోకడలని అందిస్తున్నారు దాసరాజు రామారావు ఈ కవితలో. [/box]

    [dropcap]ఇం[/dropcap]టిముందు తుషార బిందువుల
    సుందరి చిందులేస్తూ-
    ఎదురుగ్గా పార్కు,
    నన్నో అల్లరుల చిన్నారిని చేసి,
    ఆడిస్తానని,ఆహ్వానిస్తూ-
    కార్లో వెళుతూ,
    ఇటునుంచటూ,అటునుంచిటూ
    చెయ్యెత్తి, ఇంద్రధనుస్సు లాంటి దేదో
    అలుకుతున్నట్లూపుతుంటే
    ఆకాశం ఉప్పొంగి,
    నా యెద మీద ఏటవాలుగా
    దిగి, వాలిపోతూ-

    నదీపాయల్లాంటి రహదారుల మీద
    కవిత్వ విహంగ వీరంగమై
    విచలమై పోతూ-
    పొద్దెదో రాత్రేదో
    తెలియని అయోమయ అమాయకత్వంలో
    ముసురు పట్టిన మౌన దినాలతో
    ముసుగులో వెచ్చని ముచ్చట్ల
    అలజడిలో తేలిపోతూ-

    ఎదురుపడే ముఖాలన్నీ
    ఫాస్ట్ ట్రాక్ భాషకు
    చిరునవ్వు సోయగ మద్దుతూ-
    వాహనాల మంద్రస్థాయి రాగమేదో
    మైదానాల కాలనీల సంచరిస్తూ,
    సంభ్రమాశ్చర్య తటిల్లతల్నిమేల్కొల్పుతూ-
    వెదజల్లిన కలల విత్తనాలు
    రాజ ప్రాసాదాల్లా మొలకెత్తినట్లు-

    ప్రెసిడెంట్ డే,
    చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ డే
    డే లన్నీ ఏవో సాంస్కృతిక
    వారధుల్ని నిర్మిస్తూ,
    సర్‌ప్రైజ్‌ల గిఫ్ట్‌లు మోసుకొస్తూ-
    చీజ్ పూసిన బ్రెడ్డుతో,
    గడ్డ పెరుగుతో
    నన్నో రుచివంతుణ్ణి చేస్తూ-

    ఫ్రీడమ్ ఆఫ్ ది స్ట్రగుల్…
    లిబర్టీ స్టాచ్యూకి నమస్కరిస్తూ-
    మహాత్మాగాంధి గుర్తొస్తున్నాడు!

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here