[dropcap]క[/dropcap]ర్ణాటక సంగీతం గాయకుడు టి.ఎమ్. కృష్ణకు మద్రాస్ మ్యూసిక్ అకాదెమీ ‘సంగీత కలానిది’ (సంగీత కళానిధి) పురస్కారం ప్రకటించడం ఒక సాంస్కృతిక, సాంప్రదాయిక దారుణం; కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి పెనుగాయం. సనాతనత్వం, ధార్మికత, భక్తి, రాముడు, కృష్ణుడు, దేవతలు, సంస్కృతి, ఆస్తికత్వం ఇలాంటి వాటికి మూర్తిమత్వం కర్ణాటక సంగీతం. వీటికి వ్యతిరేకమైనవి కర్ణాటక సంగీతానికి చెందవు. వీటికి పూర్తిగా వ్యతిరేకమైన టి.ఎమ్. కృష్ణకు సంగీత కలానిది పురస్కారం ప్రకటించడం ప్రమాదకరమైన పరిణామం.
కర్ణాటక సంగీతాన్ని వక్రీకరించే, భ్రష్టుపట్టించే ప్రయత్నంలో భాగంగా టి.కృష్ణకు ఈ పురస్కారం ప్రకటించడం జరిగిందని సంగీత లోకం గ్రహించింది; గర్హిస్తోంది. గతంలో తన వికృత ప్రవర్తనవల్ల మ్యూసిక్ అకాదెమీ చేత తిరస్కారించబడి వెలివెయ్యబడ్డాడు టి.ఎమ్. కృష్ణ. తానూ మ్యూసిక్ అకాదెమీని తిరస్కరించాడు. అటు తరువాత తాను ఎప్పటికైనా సంగీత కలానిది పురస్కారాన్ని పొందుతానని ధీమా వ్యక్తం చేశాడు అతడు. ఇప్పుడు అతడికి సంగీత కలానిది పురస్కారం ప్రకటించబడింది. ఏ విధంగా ఆ పురస్కారం అతడికి వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
మద్రాస్ మ్యూసిక్ అకాదెమీ విదేశీ మత మాఫియాల, లెఫ్ట్ మాఫియాల చేతిలోకి వెళ్లిపోయిందా? టి.ఎమ్. కృష్ణకు సంగీత కలానిది అన్న పరిణామం మద్రాస్ మ్యూసిక్ అకాదెమీ విదేశీ మత మాఫియాల, లెఫ్ట్ మాఫియాల చేతిలోకి వెళ్లిపోయిందా అన్న అనుమానాన్ని దాటి మద్రాస్ మ్యూసిక్ అకాదెమీ విదేశీ మత మాఫియాల, లెఫ్ట్ మాఫియాల చేతిలోకి వెళ్లిపోయింది అన్న భయాన్ని కలిగిస్తోంది.
జాతి, జాతియతా, సనాతన, వ్యతిరేక శక్తుల పని తీరు ఎంత బలంగా ఉంటుందో ఈ పరిణామం తెలియజేస్తోంది. లెఫ్ట్, విదేశీ మత మాఫియాల పని తీరు ఏ స్థాయిలో ఉంటుందో ఈ పరిణామం తెలియజేస్తోంది. సనాతన, ధార్మిక, హిందూ వ్యతిరేక శక్తులు దేశంలో ఎలా పని చేస్తున్నాయో ఈ పరిణామం తెలియజేస్తోంది. టి.ఎమ్. కృష్ణకు సంగీత కలానిది పురస్కారం కర్ణాటక సంగీతం పరంగా భారతీయతను దెబ్బకొట్టే కుట్ర.
సంగీత కలానిది పురస్కారాన్ని తీసుకుంటే టి.ఎమ్. కృష్ణ ఏం చెయ్యగలడు? ఈ పురస్కారం ద్వారా మ్యూసిక్ అకాదెమీ కార్యనిర్వాహక మండలి అయిన విద్వత్ సభ లేదా సెనెట్‌లో టి.ఎమ్. కృష్ణకు అతి ముఖ్యమైన స్థానమూ, కొన్ని నిర్ణయాలు తీసుకోగల స్థితీ వస్తాయి. అప్పుడు అతడు అతడి వర్గం వాళ్లతో కర్ణాటక సంగీతం ఆత్మ ఐన భారతీయతను కర్ణాటక సంగీతం రూపంలోనే ధ్వంసం చెయ్యడానికి మ్యూసిక్ అకాదెమీని ఒక పెద్ద వేదికగా ఉపయోగించుకోగలడు.
కర్ణాటక సంగీతం ఏ కులం సొత్తో కాదు. ఇందుకు కె.జె. ఏసుదాస్ ఒక నిలువెత్తు ఉదాహరణ. కర్ణాటక సంగీతం భారతీయతా సంపద. కర్ణాటక సంగీతం ఈ మట్టి సాంప్రదాయిక, సాంస్కృతిక సంపద. ఏసుదాస్‌లాగా ఎవరైనా భారతీయతతో కర్ణాటక సంగీతంలోకి రావచ్చు. ఆంగ్ల క్రైస్తవుడు Jon B. Higgins భారతీయతతో కర్ణాటక సంగీత విద్వత్ గాయకుడయ్యాడు. ఏ పరిస్థితిలోనూ భారతీయతా వ్యతిరేకులకు కర్ణాటక సంగీతం బలికాకూడదు. అరివళ్షగన్ వంటి బ్రాహ్మణేతర కర్ణాటక సంగీతం గాయకులు టి.ఎమ్. కృష్ణలోని కర్ణాటక సంగీత వ్యతిరేక ధోరణిని తీవ్రంగా నిరసిస్తున్నారు. ‘భారతీయతా స్పృహ’ ఉన్న పలువురు కర్ణాటక సంగీత కళాకారులు టి.ఎమ్. కృష్ణకు సంగీత కలానిది పురస్కారం ప్రకటనను తీవ్రంగా నిరసిస్తున్నారు; మ్యూసిక్ అకాదెమీని బహిష్కరిస్తామని వాళ్లు తెలియజేస్తున్నారు.
తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న ఈ తరుణంలో మ్యూసిక్ అకాదెమీ టి.ఎమ్. కృష్ణకు ప్రకటించిన సంగీత కలానిది పురస్కారాన్ని ఉపసంహరించుకోవాలి. టి.ఎమ్. కృష్ణకు సంగీత కలానిది పురస్కారాన్ని ఉపసంహరించుకోవడంవల్ల మ్యూసిక్ అకాదెమీ పరువు, స్థితి చెడిపోకుండా ఉంటాయి. టి.ఎమ్. కృష్ణకు సంగీత కలానిది పురస్కారాన్ని ఉపసంహరించుకోవడంవల్ల కర్ణాటక సంగీతం ధ్వంసం కాకుండా ఉంటుంది; భారతీయతకు కీడు జరగకుండా ఉంటుంది. టి.ఎమ్. కృష్ణకు సంగీత కలానిది పురస్కారాన్ని ఉపసంహరించుకోవడంవల్ల సనాతన వ్యతిరేక శక్తుల కుట్రలు నిర్వీర్యం ఔతాయి. టి.ఎమ్. కృష్ణకు సంగీత కలానిది పురస్కార ఉపసంహరణం తప్పకుండా జరగాలి; అది జరుగుతుందని ఆశిద్దాం.