తల్లివి నీవే తండ్రివి నీవే!-40

1
2

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

రామం పురుషోత్తమమ్

సుపర్ణం వైనతేయం చ నాగారిమం నాగభీషణమ్।

జితాన్తకం విషారిం చ అజితం విశ్వరూపిణమ్।

గరుత్మన్తమ్ ఖగశ్రేష్ఠం తార్క్ష్యమ్ కశ్యపనన్దనమ్॥

ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః।

యః పఠేత్ ప్రాతరుత్థాయ స్నానే వా శయనేఽపి వా॥

విషం నాక్రామతే న చ హింసన్తి హింసకాః।

సఙ్గ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే।

బన్ధనాన్ముక్తిమాప్నేతి యాత్రాయాం సిద్ధిరేవ చ॥

(గరుడ ద్వాదశనామ స్తోత్రం)

విః – గరుడో, ధాతా – ధారకో యస్యేతి వా॥

గరుడుడు ఎవరికి ధారకుడో (వాహనమో) ఆయన విధాతా.

విగతౌ ధాతారౌ॥ – ధారకపోషకౌ యస్యేతి వా

ఎవరికి దారకపోషకులైన జన్మనిచ్చిన వారు ఉండరో (స్వయంభూః) ఆయనే విధాతా

వీనాం – విశిష్టానాం ముక్తానాం, ధారకత్వాత్ వా॥

విశిష్టులైన ముక్తులను ధరించు వాడు. (ముక్తానాం పరమాగతిః). ముక్తాత్మలను ఉద్ధరించు వాడు.

ఇక అద్వైత వ్యాఖ్యానం ప్రకారం..

కర్మఫలములను అందిస్తూ భగవానుడు విధాతా అని స్తుతింపబడుచున్నాడు. ఈ విశ్వంలో జరిగే ప్రతి కార్యమూ ఒక క్రమ పద్ధతిలో ఆయన అదుపాఙ్ఞలలో నడుస్తున్నది.

God does not play dice – Albert Einstein

Albert Einstein’s famous assertion, “God does not play dice,” has resonated across time. But what did he mean by it? And how did Einstein envision God?

Rejecting the probabilistic nature of quantum mechanics, Einstein believed that God does not engage in random chance. He argued that the laws of physics should not yield to uncertainty.

Despite growing up in a nonobservant Jewish household, Einstein’s intellectual journey revealed the tension between science and scripture. He developed a strong aversion to dogmatic religion, embracing empiricist philosophy instead.

This philosophical foundation influenced his groundbreaking work, including the iconic equation (E = mc^2), which transformed our understanding of space and time. Although initially aligned with Ernst Mach’s empiricism, Einstein later criticised it, emphasising that Mach excelled in mechanics but faltered in philosophy.

Thus, Einstein’s perspective on God and the universe remains both familiar and elusive, much like his famous equation.

భగవానుడు కూడా అంతే. అంతా ఒక క్రమ పద్ధతిలో ఉండేలా చూస్తాడు. అవసరాన్ని బట్టీ (లీలావినోదం) ఆ క్రమాన్ని మార్చేది కూడా ఆయనే.

Talking about Classical and Quantum Mechanics, the uncertainty is what makes the existence of God enticing.

శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రంలో పరస్పర విరుద్ధమైన నామములు చాలా కనిపిస్తాయి. అవన్నీ గతంలో చూశాము కూడా. ఆ వైరుధ్యాలు మానవులకే కానీ భగవంతునికి కాదు. అదే విశ్వశక్తికి వర్తించవు.

“Contradictions do not exist. Whenever you think that you are facing a contradiction, check your premises. You will find that one of them is wrong” – Francisco d’Anconia in Ayn Rand’s Atlas Shrugged.

One of the most famous dialogues and quotable quotes.

కానీ ఇది జీవాత్మలకే. వాటన్నిటికీ ఆధారభూతమైన పరమాత్మకు కాదు. ఆ వైరుధ్యాలకు అలవావమైన వాడే పరమాత్మ. అందుకే ఆయన విధాతా.

  1. ధాతురుత్తమః

సర్వ ధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానై ధాతురుత్తమః అని భగవానుడు కీర్తింపబడుచున్నాడు.

బ్రహ్మ దేవుని సృష్టించి, ఆయనకు సృష్టి చేసే విధానమును తెలిపి, ఆయనకు చతుశ్శ్లోకీ భాగవతము ద్వారా పరబ్రహ్మ తత్వమును తెలిపి, బ్రహ్మ గారి కంటే ఉన్నత స్థితిలో ఉండటం వలన ధాతురుత్తమః.

ధాతు అనగా కార్యకారణ స్వరూపమైన విశ్వమునకు ఆధారమైనది. ఉత్తమ అనగా సర్వోత్కృష్ట స్థితి.

సర్వోత్కృష్ట స్థితిలో ఉంటూ ఈ విశ్వమంతటకూ ఆధారభూతుడై ఉన్నాడు కనుక ధాతురుత్తమః. అందుకే ఆయన నిర్దేశింపబడడు. నిర్దేశించే వాడు. అందుకే అగోచరుడౌతున్నాడు.

ఇక సత్యసంధ తీర్థుల వారి ప్రకారం..

ధాతుభిః తదుపలక్షితశబ్దైః రువతే॥ – శబ్ద్యతే ఇతి ధాతురుత్, అతిశయేన ధాతురుత్ ధాతురుత్తమః

ధాతువులచే, క్రియాపదములచే ఉపలక్యితమైన శబ్దములచే పిలువబడువాడు దాతురుత్. ధాతురుత్లలో అత్యున్నతుడు కనుక ధాతురుత్తమః. అందుకే గొప్ప శబ్దస్వరూపుడు.

ధాతువు అంటే గానమునందు గల పల్లవి. ధాతువులచే పొగడబడువాడు ధాతురుత్. వారిలో శ్రేష్ఠుడు ధాతురుత్తమః. అంటే కీర్తనలతో కీర్తింపబడువారిలో తలమానికమైనవాడు. అత్యుత్తముడైన వాడు. లేదా అటువంటి విశ్వశక్తి. ధాతువు అంటే పల్లవి. మాతువు చరణం.

ధాతుభిః తత్ప్రకృతికాఖ్యాతాదిభీ రౌతి॥ – వ్యవహారతీతి ధాతురుత్ – హనుమాన్, తేన తమ్యతే – ఇష్యతే ఇతి వా

ధాతువులు మూలభూతముగా గల క్రియలచే పిలువబడువాడు ధాతురుత్. అంటే హనుమంతుడు. ధాతురుత్తమ అంటే హనుమంతుడి చేత కోరబడునటువంటి వాడు.

శ్రీరామ!

రామ!

రామ ఇతి.

విశేషం చూద్దాము.

సీతారాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో రావణాసురుడు సీతను అపహరించగా సీత జాడను వెతకడంలో ఆంజనేయుడు పాత్ర ఎంతో కీలకమైనది. రావణాసురుని సంహరించిన తరువాత సీతమ్మని తోడ్కొని తిరిగి అయోధ్యకు పయనమయ్యే సమయంలో వానర సైన్యం, వారితో హనుమంతుడు అయోధ్యకు చేరుకుంటారు. అక్కడ శ్రీరాముడికి ఎంతో ఘనంగా పట్టాభిషేకం జరుగుతుంది.

శ్రీరామ పట్టాభిషేకం అనంతరం అయోధ్యకు చేరుకున్న వారందరు ఒక్కొక్కరుగా అయోధ్య నుంచి తిరిగి తమ తమ నెలవులకు వెళ్ళారు. శ్రీరాముడు వారి పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి వారందరిని సాగనంపాడు. రాముడి వెంట వచ్చిన వానరులు రాక్షసులు రెండు నెలల పాటు అయోధ్యలో గడిపి అయోధ్య నుంచి తిరిగి పయనమయ్యారు.

ఈ విధంగా వానరులలో చివరి వంతు హనుమంతుడికి వచ్చింది. అయోధ్య నుంచి వెళ్ళిపోతున్న సందర్భంగా హనుమంతుడు రాముని ఈ విధంగా కోరాడు.

ప్రభూ! నా వినతి మన్నించు. నిత్యం నీ భక్తుడిగా ఉంటూ నిన్ను కొలుచుకునేలా నన్ను ఆశీర్వదించు. ఇలపై రామకథా పారాయణం కొనసాగుతున్నంత వరకు నేను జీవించి ఉండేలా ఆశీర్వదించు అని కోరాడు.

స్నేహో మే పరమో రాజంస్త్వయి తిష్ఠతు నిత్యదా।

భక్తిశ్చ నియతా వీర భావో నాన్యత్ర గచ్ఛతు॥

హనుమంతుడు ఈ విధంగా కోరగానే రాముడు ఆంజనేయుని దగ్గరకు చేర్చుకుని హనుమా! ప్రజలు మా గాథను పారాయణం చేస్తున్నంత కాలం నీ కీర్తి దశదిశలా వ్యాప్తిస్తుండుగాక. ఈ సృష్టి, ప్రపంచం ఉన్నంత వరకు నువ్వు చిరంజీవిగా వర్ధిల్లు అని రాముడు వరమిచ్చాడు.

ఇదే కాదు విశేషం. రామ-రావణ యుద్ధ సమయంలో అటు వానర వీరులు, ఇటు రామలక్ష్మణులు పడిపోయినప్పుడు హనుమంతుడు అస్త్ర బంధనం విడిపించుకుని (తక్కువ సమయంలోనే) విభీయణుడు మాత్రమే నిలిచి ఉండటం చూస్తాడు. వారిద్దరూ ఎవరెవరు పడిపోయారో, ఎవరెవరు ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోవటానికి కాగడాలు పట్టుకుని వెతుక్కుంటూ వెళ్ళారు.

అప్పుడు వారు కాస్త కాస్త అప్పుడే తెలివి తెచ్చుకుంటున్న జాంబవంతుని చూస్తారు.

విభీషణుడు ఇలా అడుగుతాడు, “పూజ్యుడా! నీవు క్షేమమే కదా?”

దానికి ప్రతిగా జాంబవంతుడు, “విభీషణా, బాణాల తాకిడికి కళ్ళు కనిపించటం లేదు.” భారంగా ఊపిరి పీలుస్తున్నాడు. కొంతసేపు ఆగి కొనసాగించాడు, “నాకు ఒక్క విషయం స్పష్టం చేయి. హనుమాన్ వానరశ్రేష్ఠః ప్రాణాన్ ధారయతే క్వచిత్?”

“వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు క్షేమమే కదా?”

ఆ ప్రశ్నకు విభీషణుడు ఆశ్చర్యపోయాడు. “పూజ్యుడా! నీవు మహారాజు సుగ్రీవుడి గురించి కానీ, నరశ్రేష్ఠుడు, మహాత్ముడైన శ్రీరాముని గురించి కాకుండా హనుమంతుని గురించి అడుగుతున్నావేమి? ఆయన మీద నీకెందుకంత ప్రత్యేకమైన అభిమానం?” అని అడిగాడు.

అప్పుడు జాంబవంతుడు ఓపిక తెచ్చుకుని ఇలా అన్నాడు,

అస్మిన్ జీవిత వీరే తు హనుమప్యహతం బలం।

హనుమత్యుజ్ఝితప్రాణే జీవన్తోఽపి మృతా వయమ్॥

“నాయనా! హనుమంతుని గురించే ఎందుకు అడుగుతున్నానో విను. ఆ బలశాలి ఒక్కడు జీవించి ఉంటే ఈ సైన్యమంతా మరణించినా మరణించనట్లే. అదే అతడు కనుక మరణిస్తే ఈ సైన్యమంతా ఉన్నా మరణించినట్లే.

“అతడు వాయుసమానుడు. అగ్నితుల్యుడు. అతడు ప్రాణాలతో ఉంటే మన అందరి ప్రాణాల మీద ఆశ పెంచుకోవచ్చు.”

వెంటనే హనుమంతుడు వినయంతో జాంబవంతుని పాదాలను స్పృశించి తన క్షేమాన్ని తెలిపాడు.

మరి అంతటి శక్తివంతుడైన హనుమంతుడు తాను శ్రీరామునికి దాసులను అని ప్రకటించుకున్నాడు సుందరకాండలో.

దాసోఽహం కోసలేన్ద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః।

హనుమాన్ శతృసైన్యానాం నిహన్తా మరుతాత్మజః॥

అంటే శ్రీరాముడి ప్రభావం హనుమంతునికి సంపూర్ణంగా అవగతమయ్యే ఉంటుంది. అలా హనుమంతుడి చేత కోరబడిన వాడు/కొలువబడిన వాడు అయిన రామచంద్రుడు ధాతురుత్తమః.

దీనితో పాటూ చతుర్ముఖ బ్రహ్మ కంటే కూడా ఉత్తముడైన వాడు ఆ పరమాత్మ కనుక ఆయన (ఆ విశ్వశక్తి) ధాతురుత్తమః అని సత్యసంధ తీర్థులవారు కూడా సెలవిచ్చారు.

పరాశర భట్టర్ కూడా ఇదే విషయాన్ని స్పష్ట పరచారు.

సృష్టాదికి మునుపే ఉన్న పరమాత్మ బ్రహ్మను సృజించాడు. ఆ బ్రహ్మ కన్నా ఆయన శ్రేష్ఠుడు. ఆ బ్రహ్మ సృష్టించిన ఈ జీవరాశులు, ప్రకృతి, ఇతరములన్నిటికి ఆయనే ఆధారము. తద్వారా ఆయన వారికంటే ఉత్తముడు (సర్వోత్కృష్టుడు). అలా ఆయన ధాతురుత్తమః.

దీనికి తోడు ఈ విషయాన్ని తిరుమళిశై ఆళ్వార్ ఇలా ప్రమాణీకరించారు. ఆయన కృతయుగం నుంచీ వివిధ రూపములలో తిరుగుతూ, తొల్త శివారాధకుడై, ఆ పైన పేయాళ్వార్ అనుగ్రహంతో వైష్ణవుడైనాడు.

ఆయన చెప్పిన ప్రమాణం..

నాన్ముకనై నారాయణన్ పడైత్తాన్ నాన్ముకమామ్ తాన్ముకమాయ్ చంగరనై తాన్ పడైత్తాన్

నారాయణుడు నాలుగు ముఖములు కలిగిన వాడిని సృష్టించెను. ఆయన్నే బ్రహ్మ అందురు. ఆ చతుర్ముఖ బ్రహ్మ తానే స్వయముగా శంకరుని సృష్టించెను అని పెద్దల వాక్కు.

ఆ శంకరునికే రుద్రుడని పేరు. ఎందుకంటే, పుట్టగానే పెద్దగా రోదించాడట. మనిషి పుట్టగానే ఏడుస్తాడు. అలా మనిషికి ఈయనకు గొప్ప సంబంధమున్నది.

We may take it as a multiverse reference. దీని కోసం

ఆ విధంగా శంకరునికన్నా, ఆ శంకరుని సృష్టించిన చతుర్ముఖ బ్రహ్మకన్నా ఉత్కృష్టుడై శ్రీమన్నారాయణుడు ధాతురుత్తమః అని కీర్తింపబడుచున్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here