[dropcap]శ[/dropcap]రీరాలు ఒకచోట
మనసులు మరోచోట ,
ఊహాలోకంలో..
విహరిస్తూ ఉంటాయ్!
ఆలోచనల్లో అలసిపోయి,
పరిష్కారానికి
మార్గం దొరకక,
అసలు పనిలో
నిమగ్నం కాలేక,
పిచ్చి పిచ్చిగా,
పిల్లిమొగ్గలు
వేస్తుంటాయ్!
కాలం కలిసిరాకపోతే,
పరాకు మాటలు
చికాకు చేష్టలు మొదలయి
కొత్త సమస్య
పుట్టుకొస్తుంది!
పరిస్థితులు
శృతి మించకుండా,
హృదయాలు,
వేరుకాక ముందే,
ప్రశాంతమైన
బ్రతుకు బాటకోసం,
శ్రమించక తప్పదు!
ప్రేమలు పంచుకోక
తప్పదు!!