‘తానా’ ప్రపంచ సాహితీ వేదికపై విశిష్ట అతిథిగా తుర్లపాటికి ఆహ్వానం

0
2

[dropcap]నం[/dropcap]దిగామకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, రచయిత, నాటకకర్త తుర్లపాటి నాగభూషణ రావు గారిని విశిష్ట అతిథిగా పాల్గొనాల్సిందిగా ‘తానా’ ఆహ్వానించింది. ప్రతి ఏటా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న‘తానా – ప్రపంచ సాహితీ వేదిక’ 2024 జూలైలో నిర్వహించే ప్రపంచ సాహితీ సదస్సులో ‘విశిష్ట అతిథి’గా పాల్గొన వలసిందిగా ‘Telugu Association of North America’ (TANA) బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తుర్లపాటి గారికి ఆహ్వానం అందజేసింది. ‘తానా’ ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు మరియు ‘తానా’ పూర్వ అధ్యక్షులు అయిన శ్రీ ప్రసాద్ తోటకూర గారు ఈ విషయం తెలియజేశారు.

‘సినీ ధ్రువ తారలకు అక్షరాంజలి’ పేరిట2024 జూలై 28న (ఆదివారం) నిర్వహించే ‘అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం’లో ఆచార్య డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి గీతాలపై 15 నిమిషాల విశ్లేషణాత్మక ప్రసంగం చేయమని తుర్లపాటి వారిని కోరినట్లు ప్రసాద్ తోటకూర ఒక ప్రకటనలో తెలిపారు.

‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ – తెలుగు భాషా సంఘం’ నుంచి ఇటీవలే ‘తెలుగు భాషారత్న జీవన సాఫల్య పురస్కారం’ అందుకున్న తుర్లపాటి గారు ‘తెలుగు సినిమాకు పట్టాభిషేకం’ పేరిట ఛానెల్5 ఏఎం లో వందకు పైగా కార్యక్రమాలను నిర్వహించి పలువురి ప్రశంసలు అందుకున్నారనీ, ఈ మధ్యనే ‘మంచి పాట – మనసులోని మాట’ పేరిట వారందించిన ప్రత్యేక కార్యక్రమాలు కూడావిశేష ఆదరణ పొందాయని ప్రసాద్ తోటకూర చెప్పారు.

‘తానా’ సాహితీ వేదిక ఆధ్వర్యాన జరిగే కార్యక్రమంలో తుర్లపాటి గారు డాక్టర్ సి. నారాయణ రెడ్డి సినీ గీతాల రాశి నుంచి ఐదు గీతాలను ఎంచుకుని ‘సినారె పంచరత్నాలు’ పేరిట విశ్లేషణాత్మక ప్రసంగం చేయడానికి అంగీకరించారని ‘తానా’ ప్రకటన తెలియజేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here