తందనాలు-10

0
2

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

91
[dropcap]ఊ[/dropcap]రి వారందరు ఒక చోట చేరిరి
గోరంతలు కొండంతలుగా చెప్పుకొనుచుండిరి
చేరిరి పిల్లలు కూడా
కేరింతలు వేస్తూ పిల్లలు ఆనందించె

92
మూగ జీవుల ఆహరం ఏరోజు కారోజే
కంగారుగా బయలుదేరు వేటకు, వెతుకులాటకు
ఆగం ఆగం చేసి తింటవి
మిగుల్చుకోవు రేపటికి

93
వరుడు పెళ్ళికి సిద్ధమై
కారులో చేరుకున్నాడు పెళ్లి మంటపం
కోరుకున్న వనితతో పెళ్ళికి
చిరు చిరు నవ్వులతో వధువు చేరె వేదికకు

94
ఉపన్యాసం విని ఊగి జనం
చెప్పులు రాళ్ళూ విసిరిరి వేదిక మీదకు
ఉపసంహరించుకొనిరి తప్పుడు మాటలను
తప్పక సభ ముగించిరి

95
కక్ష సాధింపు చర్యలతో విసిగిన కుటుంబం
సాక్ష్యాధారాల కోసం అన్వేషించిరి
లక్ష్య సిద్ధితో ఆధారాలు లభించె
దీక్ష బూని కార్యము సాధించె

96
చిన్నారులు చేరిరి ఆటలకు
నిన్న మొన్న ఆటలన్నీ గుర్తు చేసుకొనిరి
కొన్ని కొత్త ఆటలు ఆరంభించిరి
అన్నీ అయినాక ఇళ్లకు చేరిరి

97
అందరూ అందలం ఎక్కాలంటే కుదరదు
కొందరు మాత్రమే అర్హులు
వారు పందెంలో గెలిచిన వారై వుండాలి లేనిచో
మందలో ఎన్నుకొన బడును

98
పూసపాటి నాగేశ్వర రావు గారి అష్టావధానం
కసిగా సాగుతుంది
రాశి ఫలాల గురించి మీ అభిప్రాయం
చూసుకొని ప్రవర్తించడం ఉత్తమం

99
అష్టావధానము జరుగుచున్నది
శిష్టా సుబ్రహ్మణ్యం గారి ప్రశ్న
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఏది ముఖ్యము
దుష్టులు విజృంభినచో రెండు ముఖ్యమే

100
వస్తా నంటూ మురిపించి వూరించు చున్నది చిన్నది
కాస్తంత ఓపిక పట్టమన్నది
దారిలో ఇరుక్కుపోయా రాలేనన్నది
అస్తమానమాయె ఇంతలో

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here