తందనాలు-13

0
2

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

121
కావు కావుమని కాకులు అరిచె
కావాలనే పని ప్రారంభించె
కేవలం కొన్ని పనులే పూర్తి
సవివరంగా ఆలోచించాడు పని పూర్తి కానందుకు

122
నేను నిన్నే చూస్తున్నానని నీకేల తెల్సు
నన్నే చూస్తున్నావని నిన్ను చూశా
కొన్ని క్షణాలముందే
అన్నీ గమనించాక తెలిసింది నీవు చూస్తున్నావని

123
చావు పుట్టుకలు ప్రకృతి అధీనం లోనే
రావు జీవి అదుపు ఆజ్ఞలలోకి
కావవే అంటూ మ్రొక్కినా ఫలితముండదు
ఈ విధమే జీవన ప్రక్రియ

124
గుడి మెట్లు కడిగితే పుణ్యమా?
మడి కట్టుకొని పూజలు చేస్తే పుణ్యమా?
కడగా నుంచుని ప్రార్థించితే పుణ్యమా?
మడత కాళ్లతో పూజలు పుణ్యమా?

125
నిత్య యవ్వనంగా వుండాలి
కొంత కాలం కాల చక్రాన్ని ఆపితే సరి
అంత ఆపగలిగే శక్తి ఎవరికుంది
పంతం పట్టి ఆపాలన్నా కాని పనేగా

126
మానవ సృష్టి ఉప గ్రహాలూ జాగ్రత్త
నానుండి మట్టితోనే పుట్టుక
నేను వద్దన్నా ఊరుకోరు మానవులు
కాన తన చుట్టూనే తిరగాలని భూమి

127
ప్రేమంటే ?
ఆ మాత్రం తెలియదా
తమ అందాలు చూసుకొని ప్రేమనుకుంటే ఎలా
మమతానురాగాలతో దీర్ఘ కాలం కలసి ఉంటేనేగా ప్రేమ కలుగు

128
అందంగా వున్న వాళ్ళందరూ బుద్ధిమంతులే?
మందంగా వున్నా బుద్ధిమంతులుంటారు
మందలో ఎందరో బుద్ధిమంతులు
అందం చూచి బుద్ధులు నిర్ణయించలేము

129
దాన ధర్మాల అగత్యం?
కనీస అవసరాలకు ధనం లేక పోవటం
కనీ వినీ ఎరుగని రీతిలో నిరుద్యోగం
అన్నీ కలిపి బీదలుగా మారటం

130
నీ ఆరోగ్య రక్షణ నీ లోనే వుంది
నీ అవసరాలకు మించి ఎక్కువ ఆశించకు
నీ అతి ఆలోచనలు మానెయ్
నీ అసంతృప్తే నీకు అనారోగ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here