Site icon Sanchika

తందనాలు-27

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

261
నోరు ఆహారాన్ని తినే అవయవం
కోరుకున్న రుచులన్నీ భుజిస్తుంది
నేరుగా పొట్టలోకి పంపిస్తుంది
అరిగిన ఆహారం రక్తంగా మారు ప్రేవులలో

262
వనంలో పెద్ద రంకె వేసె బసవడు
వనంలోని జంతువులన్నీ భీతిల్లి
కనబడకుండా పారిపోయె
వనమంతా తిరిగి నిష్క్రమించె బసవడు

263
రక రకాల వస్తు ప్రదర్శన శాల
చక చకా చేరిరి అమ్మాయిలు అబ్బాయిలు
వంకలు పెట్టిరి వస్తువులకు
ఒక్కటీ కొనకుండా వెళ్లిపోయె

264
నిలువు దోపిడీ ఇస్తారు దేవుళ్ళకు
కొలువు తీరిన దేవుడు వరాలిస్తాడని
మేలు చేస్తాడనే నమ్మకంతోనే
పలు మార్లు మొక్కి వేడుకుంటారు

265
వూసరవెల్లి రంగులు మార్చినట్లే
మోసగాళ్లు తమ మాటలతో మోసగిస్తారు
కాస్తంత గూడా ఆలోచించుకోనివ్వకుండా
తస్కరిస్తారు సొమ్మునంతా

266
లోకములో వున్న ప్రజ
వక్ర మార్గాలకు ఎందుకు పాల్పడతారో?
సక్రమంగా అంత సంపాదించ లేకనే
అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఆశ

267
కోరుకున్నవి పొందలేక, అప్పులు పాలైనా
నిరాశ నిస్పృహలతో జీవితం సాగించలేక
ఉరికి సిద్ధమౌతారు
ఉరి ఆహ్వానించి అంతం చేస్తుంది

268
కాకుల ప్రవర్తన విచిత్రమైనది
ఒకటి చనిపోతే దాని చుట్టూ చేరి అరుస్తవి
చక చకా నీటిలో స్నానము చేస్తవి
ఐకమత్యంగా వుంటై

269
మనసును అదుపులో ఉంచాలని
కనులు మూసుకొని ధ్యానం
ధ్యానంలో మనసు ఆధీనంలోనే వున్నదా లేదనే ఆలోచన
కనుక అదుపెక్కడ?

270
మనసు కోతి లాంటిది
తనను అదుపు చేయటం సాధ్యమా
తనను ఎవరైనా చూశారా
తనను చూసేది వైద్యుడు మాత్రమే, అదీనూ మాంసం ముద్దనే

Exit mobile version