[dropcap]ప[/dropcap]ల్లవి:
ఉక్కు గుండె అంటే
అదే ప్రకాశం…… అరెరే…. వాడే ప్రకాశం
ఆంధ్రకేసరి అంటే
వాడే టంగుటూరి….. అరెరే వాడే టంగుటూరి ॥ఉక్కు॥
చరణం:
ఆంధ్ర పౌరుషం ఎల్లడెల్లడల చాటిన వాడు
ఆంధ్ర గౌరవం దేశదేశాల నిలిపిన వాడు
ఆంధ్ర మాత మురిసిపోయే బిడ్డడు వాడు
ముద్దు బిడ్డడు వాడు ॥ఉక్కు॥
చరణం:
గ్రామ రాజ్యమే రామరాజ్యమని భావించాడు
గ్రామ ప్రజలే జాతి జీవమని నమ్మిన వాడు
తన సర్వస్వమూ ధారవోసిన ధన్యుడు వాడు
త్యాగధనుడు వాడు ॥ఉక్కు॥
కోరస్:
ఉక్కు గుండె ఎదురైతే
వాడే ప్రకాశం…. అరెరే… వాడే ప్రకాశం
వాడి బాటలో నడిచిన నాడు
కోరస్:
అదే ప్రకాశం… అంతటా అదే ప్రకాశం
అరెరే.. అదే ప్రకాశం… అంతటా అదే ప్రకాశం!