[box type=’note’ fontsize=’16’] కావలి లోని రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్‍లో ఏడవ తరగతి చదువుతున్న టి. తేజస్విని వ్రాసిన కథ “తప్పిదం“. మానవులు చేసే తప్పిదాలు ప్రకృతికి ఎంత హాని చేసి, తద్వారా మనిషికే ఎలా ముప్పుగా పరిణమిస్తున్నాయో తెలిపిన కథ ఇది. కథకి తగ్గ బొమ్మ గీసిన తేజస్వినికి అభినందనలు. బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]
[dropcap]శ్రీ[/dropcap]ధర్ చెన్నైలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. శ్రీధర్ వాళ్ళ భార్య పేరు లత. ఐదేళ్ళ సహస్ర వాళ్ళ పాప. వాళ్ళు చెన్నైలోని సి.ఐ.టి. నగర్‌లో నివసిస్తున్నారు.
ఒక రోజు లత శ్రీధర్ దగ్గరకు వయ్యారంగా కాఫీ పట్టుకుని వస్తుంది.
“ఏమిటోయ్ లతగారు! అంత ప్రేమగా కాఫీ పట్టుకొని వస్తున్నారు! ఏంటి విశేషం?”
“ఏం లేదండి, ఈ రోజు మహిళా దినోత్సవం. నాకు ఏదైనా కొనీయరూ”
“సరే ఏం కావాలో చెప్పు”
“మా చెల్లివాళ్ళు రెండు డోర్లు ఉండే ప్రిజ్ కొన్నారండి. మనం కూడా కొందాం అండి”
“మొన్నే కదా మేరేజ్‌డేకి రవ్వల నెక్లెస్ కొనిచ్చాను. ఇంకా ఏం కావాలి? ఎవరన్నా మిద్దెలు పెంచుకు పోతారు, నువ్వేంటే ఫ్రిజ్ డోర్లతో పోటీ పడుతున్నావు?”
“ఏమండి ప్లీజ్, నా పరువు కాపాడరూ”
“సరే అలాగే. తప్పుతుందా”
ఆ రోజు సాయంత్రానికల్లా ఫ్రిజ్ డెలివరీ అయ్యంది. ఫ్రిజ్ మీద ఉన్న అట్టపెట్టెను థర్మాకోల్‌ను, ప్లాస్టిక్ కవర్ను తొలగించి ఫ్రిజ్‌ను బయటకు తీస్తారు.
“అబ్బా చూడండి మన ఇంటికి ఎంత కళొచ్చిందో”
“ఇంటికేమోగాని నీ మొహంలో మాత్రం కళ వెలిగిపోతుంది” అన్నాడు శ్రీధర్.
లత ఒక నవ్వు నవ్వింది.
***
మరుసటి రోజు రాత్రి బయట వాన కురుస్తున్నది. ఆఫీసు పని మీద శ్రీధర్ బెంగుళూరు బయలుదేరి వెళ్ళాడు. మరసటి రోజు ఉదయం వరకు వాన సన్నగా పడుతూనే ఉంటుంది. ఉదయాన్నే ఆరు గంటలకు లత ఇంటి బయట తలుపు తెరిచి చూస్తుంది. ప్రతి రోజు ఉండాల్సిన పాల ప్యాకెట్ అక్కడ లేదు. బహుశా వాన కారణంగా పాలవాడు రాలేదేమో అనుకొని దగ్గరలో షాపుకు వెళ్ళి తీసుకొద్దామనుకుంది. సహస్ర బెడ్‌రూమ్‌లో నిదురపోతూ ఉంటుంది. బయట నుండి తలుపు వేసుకొని గొడుగుతో షాపుకు బయలు దేరుతుంది. దగ్గరగా ఉన్న షాపు మూసివేయంతో తరువాత వీధిలో ఉన్నటువంటి షాపుకు బయలు దేరుతుంది. లతకి సూర్యోదయం కంటే సన్‌రైజ్ కాఫీ చుక్క గొంతులో పడితేనే తెల్లారినట్లు లెక్క. షాపు దగ్గరకు వెళ్ళే దారిలో పక్కనే ఉన్న సైడు కాలువ నిండిపోయి ప్రవహిస్తూ ఉంటుంది. పాల ప్యాకెట్ కొందామని పరుసు నుంచి యాబై రూపాయల నోటు తీయబోయింది. వెవుక నుంచి అరుపులు వినిపిస్తాయి. వెనుకకు తిరిగి చూసేసరికి కొంత మంది అరుచుకుంటూ వస్తూవుంటారు. ఆ హడావిడికి షాపు అతను కూడా బయటకు వచ్చి నిలబడి ఎందుకు పరుగులు తీస్తున్నారని విచారిస్తాడు. కాలవలు నిండిపోయి ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయని వారు చెబుతారు.
‘ఇళ్ళలోకి నీళ్ళు రావడం ఏమిటి తను ఇప్పడే కదా వచ్చింది’ అని అనుకుంటూ ఇంట్లో వున్న తన కూతురు గుర్తుకు వచ్చింది. వెంటనే వేగంగా ఇంటి వైపు పరిగెడుతుంది. తమ ఇల్లు ఉండే వీధి మొత్తం నీళ్ళు నిండిపోయి ఉంటాయి. ఎక్కడ నుంచి నీరు వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. అప్పటికే దూరం నుంచి చూస్తే తన ఇంటి పావు భాగానికి నీళ్ళు వచ్చేసాయి.
లతకి ఒక్కసారి శరీరంలో వణుకు పుడుతుంది. గట్టిగా పాపా అని అరవాలని అనుకుంటుంది కాని మాట బయటకు రాదు. కనీసం ఇంటి దగ్గరకు వెళ్ళడానికి కూడా వీలు కాలేదు. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు వచ్చి ఉంటాయి. తమ చుట్టు ప్రక్కన వాళ్ళు ఇంటి గోడల మీద ఎక్కి ప్రాణాలు దక్కించు కోవడానికి పరిగెత్తుతుంటూరు. క్షణ క్షణానికి నీటి మట్టం పెరుగుతూపోతూ ఉంటుంది. లతకి భయంగా ఉంది.
“మా పాప ఇంట్లో ఉంది రక్షించండి” అని గట్టిగా అరవడం మొదల పెట్టింది. ఎవరు వినే స్థితిలో లేరు.
చుట్టుప్రక్కల కొందరు సాహసం చేస్తూ నీటిలో దిగి అందరికి సహాయం చేస్తూ ఉంటారు. లత నీళ్ళలోకి వెలుతున్న ఒక వ్యక్తిని చెయ్యి పట్టుకొని “మా పాప ఇంటిలో నిదురపోతుంది ఇంటిలో ఎవరు లేరు రక్షించమ”ని ప్రాధేయ పడుతుంది. అప్పటికే ఇంటి సగభాగం పైన నీరు నిండిపోయి ఉంటుంది. అతను “అమ్మ ఇల్లు దూరంగా ఉంది అక్కడికి వెల్లడం కష్టం. ఇంకెవరిని అయినా అడుగు” అని చెప్పి వెళ్ళిపోతాడు లత వెంటనే తన మెడలో నాలుగు సవరల చైను తీసి అతను చేతిలో పెట్టింది. అతని రండు కాళ్ళు పట్టుకుంది. అతను ఆ చైను ఆయన ప్యాంటు జేబులో పెట్టుకొని ఈదుకుంటూ లత ఇంటి వైపు బయలుదేరుతాడు. ఇంతలో మూడు పోలీసు వ్యాన్లు వచ్చి ఆగుతాయి.
మైకులో వారు ఊరికి కాస్త దూరంలో ఉన్న చెంబరవాకం డ్యామ్ పై నుంచి వస్తున్న వరద నీటితో నిండిపోవడం వలన అన్ని గేట్లు ఎత్తి వేసారని, దాని వల్ల ఒక్క సారిగా నీటి ప్రవాహం పెరిగింది, ఇళ్ళలో ఎవరూ వుండ వద్దని అనౌన్స్ చేసారు. పోలీస్ వారితో పాటు కొందరు గజ ఈత గాళ్లు రంగంలోకి దిగుతారు. ఈ గందరగోళంతో తన ఇంటి వైపు వెళ్ళిన వ్యక్తి ఇంటి తలుపు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆపాటికే తలుపు ముడు వంతులు నీళ్ళు వచ్చి ఉంటాయి. అంటే ఇంటిలో తన పాప పడుకొని ఉన్న మంచం అప్పటికే మునిగిపోయి ఉంటుంది. లత పిచ్చిదానిలా గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది. ఇంతలో నీళ్ళలోకి దిగిన గజ ఈత గాళ్ళు కాలువకు అడ్డుగా నిలబడి పోయిన చెత్తను తొలిగిస్తారు. వారిలో ఒక వ్యక్తి చేతిలో ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ థర్మాకోల్ తీసుకొని నీటి నుండి బయటకు వచ్చి అక్కడ వున్న ఇల్లు మునిగి పోవడానికి ఆ చెత్తే ప్రధాన కారణం అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి మీరు నిర్లక్ష్యంగా పడవేసిన చెత్త వలన ఈ రోజు నీరు నిలబడిపోయి మీ ప్రాణాలకే ముప్పు ఏర్పడిందని చెప్పారు. లత ఆలోచన ఒక్కసారి ప్రిజ్ తెచ్చిన రోజుకు వెళ్ళిపోయింది.
***
“లతా ప్లాస్టిక్ కాయితం, థర్మాకోల్ అటక మీద వుంచు, రేపు ఎప్పుడైనా ఇల్లు మారాలంటే ప్యాకింగ్‌కు ఉపయోగపడుతాయి” అన్నాడు శ్రీధర్.
“మీదంతా చాదస్తం అండీ. ఎప్పుడో మారబోయే దానికి ఇప్పటి నుంచి దాచవలసిన అవసరం ఏమిటండి?” అని చెప్పి వాటిని తీసుకు వెళ్ళి ఇంటి గోడ అవతల పడవేస్తుంది. సరిగ్గా ఆ గోడకు దగ్గర నుంచి కాలువ వెళ్ళుతుంది.
ఆ ఈతగాడు చేతిలో తను పడవేసిన ప్లాస్టిక్ కాగితం థర్మాకోల్, తను పడవేసినవే అని అర్థం అయింది. ఇంతలో నీటి మట్టం తగ్గిపోతూ వస్తుంది. ఆత్రుతతో ఇంటి వైపున చూసింది. నీటి మట్టం ఇంటి గడప వరకు తగ్గిపోయి ఉంటుంది. పాపను తీసుకు రావడానికి వెళ్ళిని వ్యక్తి పాపను తీసుకొని వస్తూ ఉంటాడు. లత పరిగెత్తుకొంటూ వెళ్ళి పాపను గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకొంటుంది. కృతజ్ఞతతో అతని వైపు చూస్తుంది. అతను ఆమె చైనును తిరిగి ఆమె చేతిలో పెట్టి “పాప కిటికి గ్రిల్స్ పట్టుకొని పైకి ఎక్కింది. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది” అన్నాడు.
సహస్ర బిత్తర మొహంతో “అమ్మా నాకు చాలా భయం వేసింది, ఎంత పిలిచినా నువ్వు రాలేదు” అంది.
తన తప్పిదం వలన జరిగిన ప్రమాదం తలచుకుని పాపను ఇంకాస్త గట్టిగా హత్తుకొన్న లత – “నన్ను క్షమించు తల్లీ, ఈ తప్పంతా నా వల్లే జరిగింది. నా అజ్ఞానమే ఇంతటికి కారణం అయ్యింది” అంది.
సహస్ర జరిగింది అర్థం కాక అమ్మ భుజంపై వాలిపోయింది.