Site icon Sanchika

తప్పిపోయిన బిట్టు

[box type=’note’ fontsize=’16’] కావలి లోని రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న వి. రేచల్ వ్రాసిన కథ “తప్పిపోయిన బిట్టు“.  బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]నగనగా ఒక పల్లెటూరిలో అడవికి మధ్యలో ఒక చిన్న ఇల్లు ఉండేది.

ఆ ఇంట్లో చిన్న బిట్టు వాళ్ళ అమ్మా నాన్నలతో కలసి ఉండేవాడు.

ఒక రోజు బిట్టు వాళ్ళ నాన్న కలసి కట్టెలు కొట్టుకోవటం కోసం అడవికి వెళ్ళాడు.

నాన్న బిట్టుతో “నా చెయ్యి పట్టుకొని నడువు” అని చెప్పాడు. కాని బిట్టు వినలేదు.

బిట్టుకి ఒక సీతాకోకచిలుక కనిపించింది. దానిని ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్నాడు.

నాన్న కట్టెలు కొట్టుకుంటున్నాడు. బిట్టు ఆ సీతాకోకచిలుకను పట్టుకోవడం కోసం పరిగెత్తాడు.

ఆలా ఎంతసేపు వెతికినా కూడా అది దొరకలేదు.

బిట్టుకి ఇల్లు గుర్తుకొచ్చింది. ఇంటికి వెళ్ళాలని అనుకున్నాడు కాని బిట్టు తప్పిపోయాడు.

ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో బిట్టుకి మళ్ళీ ఆ సీతాకోకచిలుక కనిపించింది.

మళ్ళీ పరిగెత్తాడు, ఆ సీతాకోకచిలుక బిట్టుకి అందలేదు.

తనకి తెలియకుండానే పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు.

నాన్న బిట్టు కోసం వెతుకుతూనే ఉన్నాడు.

చివరికి ఇంటికి రాగానే బిట్టు ఇంట్లో ఉండడటం చూసి నాన్నకి అసలు ఏమి అర్థం కాలేదు. తరువాత బిట్టు జరిగింది వాళ్ళ నాన్నకి చెప్పాడు.

అప్పటి నుంచి అందరూ సంతోషంగా ఉండసాగారు.

నీతి – పెద్దలు ఏది చెప్పిన అది మన మంచికే.

                                                                             వి. రేచల్, ఏడో తరగతి

Exit mobile version