తప్పిపోయిన మనిషి

0
2

[dropcap]ని[/dropcap]జానికి నిలువెత్తు ప్రతీకగా
నిరంతరం నిర్భయంగా
నిస్వార్థానికి మారు పేరై
నికార్సైన వ్యక్తిత్వానికి ప్రతి రూపమై
ఆత్మ విశ్వాసంతో నిండైన మనిషిగా
నిత్య ప్రమాదాల్ని సైతం ఖాతరు చెయ్యక

పదుగురి కోసం పోరాడే వాడు
అధికారుల ఆగడాలను నిలదీసే వాడు
ఆశా-సౌభ్రాతృత్వాలను శ్వాసించే వాడు
స్వతంత్ర జీవన యానపు ఆటంకాలకు కుంగక
ఒక్కడే వంద పెట్టుగా ఉద్యమిస్తూ
నీతికి నిదర్శనంగా – న్యాయానికి సైనికుడిగా
సదాచార సంపన్నుడిగా, నిత్య విద్య్యార్థిగా, వీర శ్రామికుడిగా
జన చైతన్య -సంక్షేమాలే ధ్యేయంగా
అసహాయులు, బ్రతుకు పోరులో అలిసిన వారికి
అక్షరాయుధాలతో అండగా నిలిచి
సతతం జ్వలిస్తూ – మానవత్వమే నినాదంగా జీవిస్తూ
రానున్న తరాలకు కానుకగా
విజయ కేతనాలను వెలిగే మైలు రాళ్లగా నిలిపి
వెళ్లే వాడేరా మనిషంటే!

అలాంటి మనిషి మీకెప్పుడైనా తారస పడితే
నాకు కబురు చేయడం మరవొద్దు.

ఆఘ మేఘాల మీదొచ్చి హృదయాలింగనం చేసుకుందాం!
కాస్తంత మనిషితనం మనక్కూడా అలవడొచ్చు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here