[dropcap]సి[/dropcap]ద్దెంకి యాదగిరి రచించిన 15 కథల సంపుటి ‘తప్ష’.
ఈ కథలు రాయటానికి సిద్దెంకి యాదగిరికి ఆయన పరిసర ప్రాంతాలు, రాజకీయ సాంస్కృతిక స్థితిగతులే కాకుండా తాను పుట్టి పెరిగిన సిద్దిపేట పరిసర ప్రాంతాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, అక్కడి రాజకీయాలు తోడ్పడ్డాయని ముందుమాటలో సంగిశెట్టి శ్రీనివాస్ రాశారు. “అస్తిత్వాలకు అవుసునందిస్తున్న కథలివి” అని ఆయన అభిప్రాయం.
“సిద్దెంకి కథలన్నీ క్లుప్తంగా ఉంటాయి. నేరుగా ఎత్తుగడ విషయంలోకి ప్రవేశిస్తుంది. ప్రతిదీ నిర్దిష్టంగా ఉంటుంది. కథాశిల్పం విషయంలో సిద్దెంకి జాగురుకతతో, ఎరుకతో ఉన్నాడని ఆయన కథలు చదివాక అన్పిస్తుంది” అని డా. సి. కాశీం తన ముందుమాటలో రాశారు.
‘చుట్టు ఉన్న సమాజం నన్ను కథలు రాసేలా పురికొలిపింద’ని శెనార్థులు అన్న ముందుమాటలో రచయిత పేర్కొన్నారు.
విరిగిన కల, రేపటి సూర్యుడు, ఎంత కంతే, అమరుల యాది, సావు, తప్ష వంటి కథలు ఈ సంకలనంలో ఉన్నాయి.
***
సిద్దెంకి యాదగిరి
పేజీలు: 152. వెల: రూ.120/-
ప్రతులకు: రచయత 19-44/2 టెలికాంనగర్, సిద్దిపేట 502103
సెల్: 9441244773