తరం మారింది

1
3

[dropcap]“కృ[/dropcap]ష్ణమూర్తీ! వచ్చే ఆదివారం తొమ్మిది గంటలకి మా వాడు నిర్మిస్తున్న అపార్టుమెంట్ నిర్మాణానికి శంకుస్థాపన. నీవు తప్పకుండా రావాలి” అన్నాడు సుందరం. సుందరం తన కష్టార్జితంతో కట్టుకున్న విశాలమైన స్థలంగల డాబా ఇల్లు పడకొట్టి డెవలప్‌మెంటుకి ఇచ్చాడు సుందరం కొడుకు. ఆ సందర్భంలోనే ఈ శంకుస్థాపన కార్యక్రమం.

గృహప్రవేశమయితే వెళ్ళవచ్చు కాని ఇలా శంకుస్థాపనలకి నేను ఎందుకు? నా మీద సుందరానికి చాలా అభిమానం. మంచి స్నేహితులం, అందుకే రమ్మనని పిలిచాడు అని అనుకున్నాను. మా స్నేహబంధం ఒక్కసారి గుర్తుకు వచ్చింది.

నిజమైన స్నేహితుల శరీరాలు వేరయినా వారి ఆత్మలు ఒక్కటే. వారి భావాలు ఒక్కటిగానే ఉంటాయి వారి గుండెల్లో. నిజమైన స్నేహితులు ఎంత మంది ఉన్నా తక్కువే. రక్తసంబంధాల మధ్య రాగద్వేషాలు ఉండొచ్చు కాని నిజమైన స్నేహితుల మధ్య ఎటువంటి బేషజాలు, అరమరికలు ఉండవు. స్నేహ సౌధానికి పరస్పర విశ్వాసమే బలమైన పునాది. కుటుంబ సభ్యులతో, బంధువులతో చెప్పుకోలేని ఎన్నెన్నో విషయాలను స్నేహితుల్తో పంచుకోగలం.

డబ్బుకి విలువ ఇచ్చే నేటి కాలంలో కుటంబ వ్యవస్థ పతనావస్థకి చేరుకుంటున్నా, స్నేహబంధం మంత్రం పటిష్టంగానే ఉంటుంది. రక్త సంబంధీకుల మద్య మాటలు కరువైపోతున్న ప్రస్తుత రోజుల్లో అలసిన హృదయాలకు కాస్తంత సాంత్వన చేకూర్చేది స్నేహ బంధమే. స్నేహం స్నేహితుడి చెమరించిన తడి కన్నులను తుడుస్తుంది. చెమరించిన కన్నుల్లో చెదిరిపోని జ్ఞాపకం. ఒడిదుడుకుల్లో, కష్టాల్లో ఓదార్పునిచ్చి ఒడ్డును చేర్చిన అభయ హస్తమే స్నేహం. జీవితాంతం ఉండే అద్బుతమైన నెట్వర్క్ స్నేహం.

సుందరం గురించి ఆలోచిస్తున్న సమయంలో మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ఇలా విశ్లేషించుకున్నాను. సుందరం మాట్లాడుతున్నప్పుడు వాడి మాటల్లో సంతోషం అగుపించలేదు. కారణం… తను కష్టపడి పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న విశాలమైన స్థలం గల డాబా ఇల్లు అగ్గి పెట్టెల్లా ఉన్న ఇరుకు గదుల నివాసం అపార్టుమెంటుగా మార్చడం ఇష్టం లేదు సుందరానికి.

అయితే సుందరం కొడుకు మాత్రం తండ్రి ఆలోచన్లకి, అతని సెంట్‌మెంట్‌కి విలువ ఇయ్యలేదు. “మీదంతా చాదస్తం, మన ఇల్లు డెవలప్‌మెంటుకి బిల్డరుకి ఇస్తే మనం కొన్ని ప్లాట్లు ఉంచుకోవచ్చు. కొంత డబ్బు కూడా ఇస్తాడు బిల్డరు. డబ్బుకి డబ్బు వస్తుంది. ఉండటానికి నివాసం కూడా దొరుకుంది. మనకిచ్చిన ప్లాట్లు అమ్ముకోవచ్చు”  అన్నాడు తండ్రితో.

“అంతే కాదు. పైసా ఖర్చు మనం పెట్టకుండానే బిల్డరే అన్నీ చూసుకుంటాడు.”

ఇలా చెప్పి సుందరాన్ని సుందరం కొడుకు ఒప్పించాడు. ఆ ఇంటిని తను పట్టుకుపోడు కదా. ఎప్పటికయినా తన కొడుక్కే కదా! వాడి ఇష్ట ప్రకారమే కానీ అని అనుకున్న సుందరం కూడా చివరికి ఒప్పుకున్నాడు.

నా ఆలోచన్లు అన్నీ నేటి సమాజం చుట్టూ తిరుగుతున్నాయి. ఏంటో నేటి మనుష్యులు, వారి తీరు తెన్నులు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ అపార్డుమెంట్ల సంస్కృతి వచ్చి పడింది. ఇది ప్రాణం లేని వాటినే కాదు ప్రాణం ఉన్న మనిషి జీవితాన్ని కూడా వ్యాపార వస్తువుగా మార్చేసింది.

సుందరం, అతని భార్య తరం మనుషులు ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటే, అతని కొడుకు తరం వాళ్ళు మరో విధంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ తరవాత తరం వాళ్ళు, వాళ్ళ ఆలోచనా విధానం మరో విధంగా ఉంటుంది.

మనిషి జీవన ప్రయాణంలో ఒకలా జీవించాలనుకుంటాడు. ఇంకోలా జరుగుతుంది. మరోలా బ్రతుకుతారు. మనం అనుకున్నదానికి వ్యతిరేకంగా జరిగితే నిరాశ కలుగుతుంది. నిస్పృహ ఆవరిస్తుంది. శరీరంలో శక్తినంతా ఎవరో పిండేసినంత నిస్సత్తువ కలుగుతుంది. జరుగుతున్న సంఘటనలు మన ఆలోచనా విధానం మీద, ప్రవర్తన మీద, ఉద్వేగాల మీద, ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి.

నేటి తరం మనుష్యుల దగ్గర నిన్నటి తరం వారు బ్రతుకు పోరాటంలో అలిసిపోతున్నారు. ప్రేమ రాహిత్యం, భవిష్యత్తు మీద అనిశ్చిత జీవితం మనల్ని అప్పుడప్పుడు మట్టి కరిపిస్తూ ఉంటుంది. అయినా లేచి నిలబడి ముందుకు అడుగువేయాలి. మళ్ళీ క్రింద పడినా తిరిగి ధైర్యంగా లేవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, నిరాశతో కృంగిపోకూడదు, ఆగిపోకూడదు. నేటి తరం దగ్గర నిన్నటి తరం వారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. ఒక్కొక్క సారి మనం అనుకున్నది అనుకున్నట్లు జరగదు.

మనం జీవితంలో ఎన్నో అనుకుంటూ పెద్ద పెద్ద ప్రణాళికలు రచిస్తాం. ఏవేవో పాటించాలని, ఎన్నో పనులు చేయాలని కలలు కంటాం. కాని మరు క్షణంలోనే ఏంటి జరుగుతుందో మనకే తెలియదు. అందుకే జీవితం క్షణకాలంలో విచ్ఛిన్నమయ్యే నీటి బుడగలాంటిది. సుందరం మాటలు సెల్ ఫోనులో విన్న తరువాత ఇలా భావోద్వేగంతో నా ఆలోచన్లు సాగిపోతున్నాయి.

కాలంతో పాటు సమాజంలో ఇన్ని మార్పులు. ఆ మార్పుల ఫలితమే ఈ గ్రూప్‌హౌస్‌లు, అపార్టుమెంట్ల సంస్కృతి. నగరాలు విస్తరిస్తూ ఉండటం వల్ల మన జాతీయ జీవన ప్రగతికి సింబల్‌గా నిలుస్తోంది ఈ సంస్కృతి – తిరిగి అనుకున్నాను.

సుందరం అసలే సెన్సిటివ్. పైగా బి.పి, షుగరు పేషంటు. తను అనుకున్న దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే డిప్రెషన్‌కి గురయ్యే అవకాశం ఉంది. ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. జీవితంలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో దిగులు తప్పదు. కష్టాలు కన్నీళ్ళు తప్పవు. అటువంటి వాళ్ళను బయటకు తీసుకురావాలంటే ఆత్మీయుల ఓదార్పు, సాంత్వన అవసరం. లేకపోతే నిరాశ, నిస్పృహ వారి ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపుతాయి.

జీవితంలో ఏదైనా నష్టపోయినప్పుడు మనిషి డిప్రెషనులోకి పోతాడు. ఇది అందరి విషయంలోను కాకపోయినా కొందరి విషయంలో ఇలా జరుగుతుంది. ఇటువంటి వాళ్ళకి ప్రశాంత వాతావరణం కలిగించాలి. వాళ్ళ ఆలోచన్లని మరో వేపు మలుపుతిప్పాలి. ఒత్తిడికి గురవ్వకుండా చూసుకోవాలి.

ఇలాంటి వాళ్ళు ఒంటరిగా కూర్చునేకంటే ఆత్మీయుల్తో, స్నేహితులతో కలిసి చర్చల్లో పాల్గొంటే మంచిది. అప్పుడే ఓదార్పు లభిస్తుంది. సాంత్వన చేకూరుతుంది. జీవన సరళిలో మార్పు వల్లే ఇది సాధ్యమవుతుంది. సుందరం మానసిక స్థితి తెలిసిన నేను ఇలా ఆలోచిస్తున్నాను.

అయినా నేడు సమాజంలో ఈ అపార్టుమెంట్ల సంస్కృతి జోరు అందుకుంది. ప్రతీ ఒక్కరూ రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తుతున్నారు. ఎక్కడ చూసినా కాంక్రీట్ కట్టడాలే. దానికి కారణం నగరాలు పెరుగుతున్నాయి. జనాభా పెరుగుతోంది. పెరిగిన జనానికి తగ్గట్టు ప్రతీ ఒక్కరికీ ఉండడానికి ఇంటి స్థలాలలేవు. అందుకే ముఖ్యంగా ఈ అపార్టుమెంట్ల సంస్కృతి.

ఓ పర్యాయం తను ఇంట్లో ప్రస్తావించాడు. ఈ అపార్టుమెంట్ల సంస్కృతి గురించి నెగిటివ్‌గా మాట్లాడేడు. వెంటనే తన మనమడు తనకి క్లాసు పీకాడు. “తాతయ్యా! ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు, మీ తరాన్ని దృష్టిలో పెట్టుకుని. నేను ఈ సంస్కృతిని సమర్థిస్తున్నాను. ఎందుకంటే నగరాలు పెరుగుతున్నాయి. జనాబా పెరుగుతోంది. మనిషికి కావల్సింది తినడానికి తిండి, కట్టుకోడానికి బట్ట, ఉండడానికి ఓ ఇల్లు. మీ తరం వాళ్ళు ఎవరు ఏం అయిపోతే మాకేంటి మేము విశాలమైన ఇంటిలో విశ్రాంతిగా ఉంటాం. ఆనందాన్ని అనుభవిస్తాం. విశాలమైన పెరట్లో రకరకాల పూల మొక్కలు పెంచుకుని, ఆ చెట్ల, మొక్కల మధ్య కూర్చుని ఆ పూల మొక్కల అందాన్ని వీక్షిస్తాంఅని అనుకుంటే – ఉండడానికి ఇల్లులేని వాళ్ళ సంగతేంటి?”

“నేడు ఈ అపార్టుమెంట్ల లోనే కదా ఒక్క కుటుంబం జీవనం సాగించే స్థానంలో అదే స్థలంలో పది పన్నెండు అంతకన్నా ఎక్కువ కుటుంబాలు జీవించే అవకాశం కలుగుతోంది. ప్రతీ ఒక్కరికీ తలదాచుకోడానికి ఓ ఇల్లు దొరుకుతోంది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుంటే ఈ అపార్టుమెంట్ల సంస్కృతి ఎంతో అవసరం నేటి కాలంలో” అన్నాడు.

తన మనుమడు రేపటి తరం వాడు. తన కొడుకు నేటి తరం వాడు. రేటి తరం వాడు కాబట్టే మా మనుమడు అలా అన్నాడు అనుకోవచ్చు. నేటి తరం మా అబ్బాయి కూడా ఇలాగే ఆలోచిస్తున్నాడు. నా మనుమడు అలా అన్నా వాడి మాటల్ని పూర్తిగా నేను సమర్థించలేకపోతున్నాను. ఎందుకంటే కొన్ని చోట్ల అంతస్తుల భవనాలు, అగ్నిజ్వాలలకి ఆహుతి అయిపోతున్నాయి. కొత్త కట్టడాలు కూడా వర్షకాలంలో కాదు ఎండాకాలంలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు కూలిపోతున్నాయి. వంతెనలు కూలిపోతున్నాయి. అంతస్తుల భవనాలు కృంగిపోతున్నాయి.

ఒక కుటుంబ భారాన్ని మోయగల స్థలంలో పది కుటుంబాలు ఎక్కితొక్కుతున్నారు. బొగ్గు పులుసు వాయువు ఎక్కువవుతోంది. ప్రాణవాయువు తగ్గిపోతోంది. ఇది వాయు కాలుష్యానికి కారణం అవుతోంది. ఇక నీటి విషయం తీసుకుంటే రసాయన అవశేషాలు. అదే రసాయనిక విషాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. ఇలాంటి నీటిని వినియోగించడం వల్ల అనేక రకాల జబ్బులు వస్తున్నాయి.

ఇరుకు సందుల్లో ఈ అపార్టుమెంట్లు నిర్మించడం వల్ల అగ్నిప్రమాదాలు జరిగినా సరియైన సహాయం అందక ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతోంది. దీనికి కారణం అక్రమ బహుళ అంతస్తుల కట్టడాలు అడుగడుగునా ఏర్పడం, దాని వలన రహదాలు కుంచించుకుపోవడం, వాటి మీద ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడమే. అంతే కాదు, అలా అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించే బదులు క్రమబద్దీకరణ పేరుతో అవి సక్రమ కట్టడాలుగా మారిపోతున్నాయి. నిర్మాణరంగం అవినీతి వాటికగా మారిపోయింది. నిజాయితీగా ఇల్లు కట్టుకునే వారికి అడుగడుగునా అవరోధాలే.

ఈ అపార్టుమెంట్ల సంస్కృతి వల్ల కనీసం పచ్చదనం కోసం, స్వచ్ఛమైన గాలి కోసం ఒక్కటంటే ఒక్క మొక్క కూడా వేసుకోవడానికి స్థలమే ఉండదు. ఒక్క కుటుంబం, లేక రెండు కుటుంబాలు నివసించే స్థలంలో నేడు ఎన్నో కుటుంబాలు నివసిస్తున్నాయి. రెండు వాహనాలు వెళ్ళే రహదారి మీద ఎన్నో వాహనాలు రాకపోకలు జరుగుతుంటే రహదారులు కృంగిపోతున్నాయి. వాహనాల రద్దీకి రాకపోకలు స్తంభించి పోతున్నాయి. ట్రాఫిక్ జామ్ అవుతోంది. జల, వాయి, కాలుష్యానికి అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాలకి ఇదీ కారణం. సుందరం ఫోను చేసిన తరువాత ఇన్ని ఆలోచన్లు నా మదిలో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here