తథ్యము సుమతీ! – పుస్తక పరిచయం

0
1

[dropcap]1[/dropcap]984లో తాను ప్రచురించిన “తథ్యము సుమతీ!” అనే వ్యాససంపుటికి పరివర్ధిత ముద్రణని 2016లో తీసుకువచ్చారు డా. మచ్చ హరిదాసు.

***

“సుమతి ఛందశ్శిల్పం గురించి హరిదాసు చేసిన విశ్లేషణ సముచితంగా వుంది. ‘సుమతి నీతి – కవితా రీతి’ అనే వ్యాసం హరిదాసు విషయ వివరణకూ శైలీ విశిష్టతకూ నిదర్శనంగా నిలుస్తుంది. ఉత్తమ పరిశోధకుని లక్షణాలు ఒంటబట్టించుకున్న హరిదాసు ఈ పథంలో మరికొన్ని వినూత్న దృక్పథాలు వెలువరించాలని ఆకాంక్ష” అన్నారు – ఆచార్య సి. నారాయణరెడ్డి ఈ పుస్తకం మొదటి ముద్రణకు వ్రాసిన ‘అభిప్రాయం’లో.

***

“హరిదాసు ఈ పరివర్ధిత ముద్రణలలో చర్చలను మరింత యుక్తియుక్తంగా తీర్చిదిద్దాడు. రచనాకాలానికి సంబంధించిన మరికొన్ని సాక్ష్యాలను సమకూర్చారు. ముఖ్యంగా తంజావూరులో సేకరించిన ప్రతులను యథాతథంగా ఇస్తూ వాటిని పరిష్కరించి చేర్చాడు. పరివర్ధిత వ్యాసంగం వెలుగులో అత్యధిక సుమతి పద్యాలను (206) అనుబంధంలో ఇచ్చాడు. సుమతి శతక పద్యసంఖ్యకు ప్రస్తుతానికి ఇదొక రికార్డు” అన్నారు ఆచార్య ఎన్ గోపి తమ ‘అభినందన’లో.

***

“మచ్చ హరిదాసు గారు మంచి పరిశోధకులు. సత్యనిష్ఠా, సత్యదృష్టీ అతణ్ణి ఉత్తమ పరిశోధకుడిగా సాహిత్యలోకంలో నిలబెట్టినై… చల్లను చిలికి వెన్న తీసినట్లు, సముద్రాన్ని మథించి అమృతం అందించినట్లు అనేక వ్యయప్రయాసల కోర్చి హరిదాసుగారు తంజావూరు ప్రతుల్ని పరిశోధించారు” అన్నారు డా. నలిమెల భాస్కర్.

***


తథ్యము సుమతీ!
డా. మచ్చ హరిదాసు
పుటలు: 232
వెల: ₹200/-
ప్రచురణ: ఇందు ప్రచురణలు, కరీంనగర్.
ప్రతులకు:
ఎం. భారతి, 1-86, పద్మానగర్, కరీంనగర్. తెలంగాణ 505002. ఫోన్: 9849517452,
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here