Site icon Sanchika

తవిళి మాటలు

[dropcap]”ఒ[/dropcap]గబుడు వాడు నాకన్నా పెద్దోడునా, ఇబుడు వాడు నా తావ ఎంతనా?” అంటా ఎగిరితిని.

“వీడుండాడూ చూడినా, వీనిది ఆ కాలములా శానా పెద్ద కతనా… కాని ఇబుడు కత అంటే నాదినా, కత అంటే నేనూనా” అని ఎగరలాడి, దుమకలాడితిని.

“అంతేనా… వీళ్లంతా జీవితములా ఎదగలేకపోయిరినా, సోలిపోయిరినా, నేను ఒగడినే గెలిస్తినినా” అని మీసం మెలేస్తిని.

ఆనందము పడితిని.

నాకి నేనే గొప్పోడైపోతిని.

***

“ఇంగ సాలు నిలపరా నీ గొప్పలు. వాళ్లంతా జీవితములా ఎదగలేదు అంటే దాని అర్థము వాళ్లు జీవితములా సోలిపోయిరని కాదు, వాళ్లకి ధైర్యం, తెలివి లేకనూ కాదు” అంటా అనే అన్న. అంతే, నాకి రేగిపోయా.

“ఇంగేమినా” అంటా అట్లే తగులుకొంట్ని.

“తవిళి మాటలు చెప్పలేక, జనాలని మోసం చేయ లేక” అనే అన్న.

అన్న మాటలు నాకి ఏడనో తగిలే.

నిజంగా జీవితంలా ఎదిగింది వాళ్లా? నేనా?

***

తవిళి మాటలు = అబద్ధపు మాటలు

Exit mobile version