Site icon Sanchika

టెక్నాలజీ ప్లస్, మైనస్

[box type=’note’ fontsize=’16’] “త్రివిక్రమావతారం దాలుస్తున్న డిజిటల్ ప్రపంచంలో – సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా దేశ పౌరుల ప్రయోజనాలను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే” అంటున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]

[dropcap]డే[/dropcap]టా దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణిస్తోంది. డేటా వలన ఒనగూడే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కృత్రిమ మేధను రూపొందించడానికి డేటాయే ఆధారం. అయినప్పటికీ డేటా స్వేచ్ఛగా లభ్యం కావటం కారణంగా జరుగుతున్న నష్టాలు తక్కువ కాదు.

జూలై నెలలో స్వేస్ ఎక్స్ ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, బరాక్ ఒబామా, జో బైడెన్ వంటి ప్రముఖుల ఖాతాలు సైతం హాకింగ్‍కి గురికావటం జరిగింది. ఇంజనీరింగ్ నైపుణ్యాలతో వారి ఐడి, పాస్‌వర్డ్స్ ను హాకర్స్ కొల్లగొట్టారు. యూజర్ ఐడి, పాస్‌వర్డ్స్ వాళ్ళ చేతికి చిక్కాక క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ సంబంధిత స్కామ్‌లను ప్రోత్సాహిస్తూ ట్వీట్లు చేశారు. కొన్ని గంటల్లోనే హాకర్ల ఖాతాలో 1.12 లక్షల అమెరికన్ డాలర్లు జమ పడిపోవడం జరిగింది.

అయితే అతి కొద్ది సమయంలోనే ‘ట్విటర్ టీం’ రంగంలోకి దిగి ఖాతాలు లాక్ చేసేసింది. తరువాత లొసుగులనూ సరి చేసింది. సకాలంలో పసిగట్టగలిగిన కారణంగా నష్టం కొనసాగకుండా చర్యలు చేపట్టడం సాధ్యపడింది. నిరంతరం అంత అప్రమత్తతకు అవకాశం లేదు. వినియోగదారుల అప్రమత్తత, జాగురూకత సైబర్ నేరాల కట్టడిలో ఎంతో ప్రాధాన్యత వహిస్తాయి. వాణిజ్యం లోనూ డేటా పాత్ర విస్మరించలేనిది.

కొనుగోలు విధానాల ద్వారా వినియోగదారుల అభిరుచులు, అవసరాలను శాస్త్రీయ, సాంకేతిక పద్ధతుల ద్వారా తెలుసుకుని మదింపు వేసి, మార్కెట్టు అనుకూల వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా కంపెనీలు మార్కెట్లను కొల్లగొట్టగలుగుతాయి. డేటాను విశ్లేషించడం ద్వారా ఇదంతా సాధ్యమే.

ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం:

(1) బహిరంగ ప్రదేశాలలోని IOT సేకరించే సమాచారం (2) మార్కెట్ వేదికలు (3) సోషల్ మీడియా (4) సెర్జ్ ఇంజిన్స్ నుంచి వచ్చే వినియోగదార్ల సమాచారానికి సంబంధించి –

1.నిల్వ చేయడానికి, 2. విదేశాలకు పంపించవలసివస్తే పాటించవలసిన విధి విధానాలకు సంబంధించి 2019 ‘ఇ-కామర్స్ విధానం’ ముసాయిదాను వెలువరించింది. ఇది 42 పేజీల డ్రాఫ్ట్. ఈ ముసాయిదాలోని డేటా వినియోగానికి సంబంధించి మార్గదర్శక సూత్రాలు పొందుపరచబడ్డాయి.

మొబైల్ డేటా వినియోగంలో భారతదేశం మొత్తం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. త్రివిక్రమావతారం దాలుస్తున్న డిజిటల్ ప్రపంచంలో – సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా దేశ పౌరుల ప్రయోజనాలను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. 2000 సంవత్సరం నాటి సాంకేతిక పరిజ్ఞానం చట్టం – సెక్షన్ – 69 (1)ని అనుసరించి అంటూ ప్రభుత్వం ఇటీవల ఎక్కడి నుండి అయినా, ఏ డేటానైనా నిలువరించడానికి, తనిఖీకి, డిక్రిప్షన్‍కి కేంద్ర దర్యాప్తు సంస్థ, నిఘా సంస్తహ్లకు విస్తృతమైన అధికారాలను దాఖలు పరిచింది.

ఈ నేపథ్యంలో – దేశ ప్రజల ప్రైవసీకి భంగం వాటిల్లగలదన్న విమర్శలూ వెల్లువెత్తాయి. ఫ్రాన్స్ డేటా భద్రతా ఏజన్సీ CNIL – వినియోగదారుల అనుమతి లేకుండా డేటాను రికార్డు చేసి వాటి ఆధారంగా వ్యాపర ప్రకటనలు రూపొందించి ఆర్థిక లాభాలు గడించిందన్న ఆరోపణతో గూగుల్‍కు 982 కోట్లు, అమెజాన్‍కు 309 కోట్లు అపరాధ రుసుము విధించడమే కాకుండా 3 నెలల్లో కట్టకపోతే, మరో కోటి పెనాల్టీ కూడా విధించింది.

Exit mobile version