తెలివి యుద్ధం చేయాలి

0
2

[శ్రీ సాహితి గారు రచించిన ‘తెలివి యుద్ధం చేయాలి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]కొ[/dropcap]న్నిసార్లు బాగా
లోతుకు చేరాక
ఈత గొడవపడితే?

పోనీలే ఆని
మౌనంగా మునిగిపోతామా?
ఊపిరి గింజుకుని
బయటకు తన్నుకొస్తమా?

ప్రాణం హక్కుగా
బ్రతికే ఆరాటంలో
తెలివి యుద్ధం చేయాలి

నిన్ను ప్రేమించుకునే
బుద్ధికి కట్టుబడి
నీ మనసే రుచిగా

ఏ సంపద ఇవ్వని సుఖం
నీలో ఏ మూలన ఉన్నదో
తెలిసి తవ్వుకో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here