Site icon Sanchika

కథావేదిక – టొరాంటో, లేఖిని – రచయిత్రుల వేదిక కథల పోటీ – ప్రకటన

[dropcap]తె[/dropcap]లుగు కథా వేదిక, టొరాంటో, కెనడా.

నిర్వాహకులు: డా. నెల్లుట్ల నవీన చంద్ర nakshatra1364@gmail.com

కథా వేదిక ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, కథావేదిక – టొరాంటో, లేఖిని – రచయిత్రుల వేదిక సంయుక్తంగా ఈ కథల పోటీ నిర్వహిస్తున్నది. ఈ పోటీలో దేశ, విదేశాలలోని తెలుగు రచయితలు అందరూ పాల్గొనవచ్చు. ఈ పోటీలో బహుమతి పొందిన కథలతో పాటు మాకు పోటీకి వచ్చిన పది ఉత్తమ కథలను కూడా నిర్వాహకులు అర్హమైనవిగా నిర్ణయిస్తే అన్ని కథలతో ఒక కథా సంపుటిగా ప్రచురించడం జరుగుతుంది. అంతేకాక గత సంవత్సరం నుంచి కథావేదికలో కథకులు చదివిన కథలు కూడా ఈ సంపుటిలో చేర్చడం జరుగుతుంది.

నిబంధనలు:

  1. ఈ కథల పోటీకి పంపవలసిన కథలు మత, కుల, వర్గ వాదాలకు తావు లేకుండా ఉండాలి. సామాజిక, కుటుంబ, ప్రేమ, క్రైమ్ వీటిలో ఏ అంశం అయినా ఫర్వాలేదు. శైలి, పంక్చుయేషన్ మార్క్స్, భాష ప్రధానంగా అర్హమైనవిగా స్వీకరించబడతాయి.
  2. కథ నిడివి ఏ 4 సైజులో పది పేజీలకు మించకూడదు.
  3. ప్రపంచం లోని ఏ దేశంలో ఉన్న తెలుగు రచయితలు అయినా ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు.
  4. కథలు మాకు చేరవలసిన చివరి తేదీ సెప్టెంబర్ 15 అర్ధరాత్రి (భారతకాలమానం ప్రకారం) 12.00 వరకు.
  5. కథలు యూనికోడ్ లో మాత్రమే ఉండాలి.
  6. కథలు ఇంతకుముందు ప్రింటు, సామాజిక, సాంకేతిక మాధ్యమాలలో కానీ, వ్యక్తిగత బ్లాకులో కానీ ప్రచురింపబడి ఉండకూడదు. కేవలం కథావేదిక కథల పోటీకి మాత్రమే వ్రాసినవి అయి ఉండాలి.

కథలు పంపవలసిన అడ్రెస్సులు:

A. Vijayalakshmi, Flat No. 205, A.K. Sai sadan, Vivekanagar, Chikkadapally, Hyderabad – 500020.

Lekhinikathaavedika@gmail.com

  1. కథతో పాటు ఈ కథ తమ స్వంత రచన అని, ఇంతకుముందు ఎక్కడా ప్రచురింపబడలేదని, హామీపత్రం జత చేయాలి.

బహుమతుల వివరాలు:

Consolation బహుమతులు పది ఒక్కొక్కటి రూ 508/-

వివరాలకు శ్రీ నవీన్ చంద్ర, టొరాంటో, అత్తలూరి విజయలక్ష్మి, హైదరాబాద్ గారిని సంప్రదించగలరు.

Exit mobile version