[box type=’note’ fontsize=’16’] విజయనగరంలో ఆంధ్ర ప్రదేశ్ గాంధీ స్మారక నిధి జాతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా “తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు” పుస్తకావిష్కరణ సభ గురించి వివరిస్తున్నారు ఎన్. కె. బాబు. [/box]
[dropcap]ఆం[/dropcap]ధ్ర ప్రదేశ్ గాంధీ స్మారక నిధి జాతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా “తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు” కథా సంకలనాన్ని విజయనగరంలో ఆవిష్కరించారు. విజయనగరం లైన్స్ కల్యాణమండపంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కథా సంకలనాన్ని మంగిపూడి రాధిక ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో గాంధేయవాది పోతన్న, పువ్వాడ జై హింద్ దేవరాజు గోపాలకృష్ణ, పి లక్ష్మణరావు, ఎన్. కె. బాబు పాల్గొన్నారు.
కస్తూరి మురళీకృష్ణ గారి సంపాదకత్వంలో వచ్చిన ‘తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు’ కథా సంకలనం మంచి గెటప్‌తో బావుంది. స్వాతంత్ర పోరాటానికి మహాత్ముడు వాడిన ఆయుధాలు సత్యాగ్రహం, అహింస. అంతేకాక వారి నినాదాలు స్వదేశీ, అస్పృశ్యతా నివారణ. ఇంకా ఈ సందర్భంలో దేశ విభజన కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకే ఈ సంకలనాన్ని స్వాతంత్ర్యానికి ముందు గాంధీ నేపథ్యంలో కథలు అలాగే స్వాతంత్ర్యానంతరం గాంధీ నేపథ్యంలో వచ్చిన కథలను అనే రెండు విభాగాలుగా రూపొందించారు. స్వాతంత్రం వచ్చిన కథల్లో సత్యాగ్రహం పైన అహింసా విదేశీ వస్తు బహిష్కరణ అస్పృశ్యతా నివారణ అప్పటి తరం వారి వ్యక్తిత్వం, దేశ విభజన వలన ఏర్పడిన అనిశ్చితి అల్లకల్లోము, ఈ అంశాలన్నీ నేపథ్యాలుగా కథలు వచ్చాయి ఇందులో సురవరం ప్రతాపరెడ్డి గారు రాసిన సంఘాల పంతులు కథ ఆనాటి పోలీస్ వ్యవస్థ ఎలా ఉండేది తెలియజేస్తుంది.
ఈ కథలు మనము చదువుతున్నప్పుడు ఆనాటి అధిక రాజకీయ సాంఘిక విషయాలు మనకి అవుతాయి. అంతేకాకుండా అప్పుడు వాడుకలో ఉండే పదాలు కూడా మనకి, స్పష్టంగా కనిపిస్తాయి ఉదాహరణకి నాకా అంటే పోలీస్ స్టేషన్ అని, గస్తీ నిషాన్ అంటే సెక్షన్ అని, జల్సాల అంటే రాజకీయ సభలు అని ట్యాంషిబర్కాస్ అంటే అవుట్ పోస్ట్ ఎత్తి వేయుట అని. ఈ కథలను చదవటం వలన గాంధీ పైన స్పష్టమైన అవగాహనకు రావటానికి అవకాశం ఉంది, గాంధీ నేపద్యంలో కథలు తీసుకురావటం బావుంది.
ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు గాంధీ పైన వ్యాసరచన చిత్రలేఖనం కథ కవిత పోటీలను నిర్వహించి బహుమతి ప్రదానం చేయటం జరిగింది విజయనగరం లోని అనేకమంది ప్రతిభావంతులకు పురస్కారాలను ప్రధానం చేయడం జరిగింది.