తెలుగు కు వెలుగు

1
2

[box type=’note’ fontsize=’16’] 29 ఆగస్టున తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా యువకవి మంగుదొడ్డి రవికుమార్ అందిస్తున్న కవిత “తెలుగు కు వెలుగు”. [/box]

[dropcap]అ[/dropcap]ల నన్నయ కలంలోని అక్షరరమ్యత నా తెలుగు
మలి తిక్కన శైళిలోని సరస సలిలము నా తెలుగు
శైవకల్పతరువు లోని సోమనాథుని దేశీయము నా తెలుగు
ఎంచి చూడు ఎర్రాప్రెగ్గడలోని ప్రకృష్ఠబంధమే నా తెలుగు
పోతనామాత్య కలమున రంగరించుకొన్న నవభక్తి భావమే నా తెలుగు
శృంగారనైషధము తో పరవశించినట్టి శ్రీనాథుని శిఖరాయామానం నా తెలుగు
అన్నమయ్య స్వరముకై పరితపించిన తిరుమలేశుని దర్శనంబు నా తెలుగు
వేమన పేర్చి బ్రౌనుదొర మెచ్చిన నీతి ప్రాకారంబు నా తెలుగు
త్యాగరాజు స్వరపరచిన సరిగమల చప్పుడు నా తెలుగు
దేవరాయ భువనమందు దివికేగిన దిగ్గజములు నా తెలుగు
అల్లసాని అల్లినట్టి ప్రబంధమాలికల అల్లిక నా తెలుగు
అమ్మభాష కు వారధి కట్టిన కొప్పరపుకవుల పద్యంబు నా తెలుగు
అందలమెక్కిన గ్రాంథికవాదపు శిరసువంచిన గిడుగు రామ బాణమే నా తెలుగు
మంచిచెడులను కులముగ తేల్చన గురజాడ గుణములే నా తెలుగు
తెలుగు అక్షరావళికి అమరశిల్పంబు జెక్కిన కృష్ణశాస్త్రి భావకవిత నా తెలుగు
కవితా ఓ! కవితా యని కవితల్లిన గళమెత్తిన శ్రీ రంగం విప్లవజల్లు నా తెలుగు
సినారె మనస్సున మెదిలినట్టి సుగంధాల సినీపాట నా తెలుగు
ఆంధ్ర జగతిన సెలయేటి అలలు గల కందుకూరి నవలా లోకం నా తెలుగు
ఆరుద్రయ్య కలంబు నుండి భువికేగిన కూనలమ్మ పాటల సవ్వడి  నా తెలుగు
విశ్వనాథ కల్పవృక్షంబు పై వర్షించిన భావ పదముల జల్లు నా తెలుగు
విశ్వనరుడనన్న జాషువ గబ్బిలంబున గల విశాల భావమె నా తెలుగు
జంధ్యాల వనమున విలపించిన పుష్పమునకండదండ నా తెలుగు
సిద్దేంద్రుని అభినయంబైన కూచిపూడి కళల జాడ నా తెలుగు
నవ్వలేకనవ్వుమన్న మాణిక్యపు హాస్యపుజల్లు నా తెలుగు
నాటి తరానికి నచ్చి  నేటి లోకం మెచ్చిన బుచ్చిబాబు  నవలా నటనయే నా తెలుగు
పొగడరా తల్లి భారతినన్న రాయప్రోలు భావాన్వితమే నా తెలుగు
పల్లెటూరి హలికవర్య ధన్యుడన్న దువ్వూరి కలము హలము నా తెలుగు
జానపదుల జానతనము పాటలోన కైకట్టిన పల్లెసీమ యె నా తెలుగు
ఆదిభట్ల కరము యందు  సద్దు చేయు పిడతల చప్పుడె నా తెలుగు
ఘంటసాల కంఠమందు జారె పసిడి గానమెల్ల నా తెలుగు

***

తెలుగు తలకట్టు ఆంధ్రజాతి కి ప్రగతిమెట్టు
తేనెలొలుకు తియ్యనైన తెలుగు అమ్మభాషకు వెలుగు
తెలుగుభాష యందలి అక్షర కీర్తి  అది అన్య భాషలకు స్ఫూర్తి
తెలుగు భాష యందలి పద్యం తరతరాల కది వారసత్వం
మనదైన తెలుగు మహిలోన వెలుగు
అనాది కవిత్రయ కవనం తెలుగు సాహిత్యజగమున తేజోమయం
అమ్మభాషలోని మకరందం  పంచిచూడు అది అమృత భాష్యం
ముద్దులొలుకు అమ్మ భాషణం పదుగురు మెచ్చు మన భూషణం
స్వచ్ఛమైన తెలుగు మాట భావి భవిష్యత్తుకు బంగరు బాట
అదిగదిగో ఆటవెలది   అది వేయు అడుగులు వేలకొలది
తెలుగదేలయున్న వికాసనామం ఏమిటది నేడు వికసించని వైనం
ఆంధ్రజగతి పై వేల కావ్యాల తెలుగు    తనివితీర చూడు వెన్నెలంత వెలుగు
తేటతెలుగున కావ్యాల జల్లు
పుడమి లోన పులకింతల హరివిల్లు
తెలుగులోన గలదు తీయదనం
తెలుసుకొంటే ఎంతో ఘనం
ఆంధ్రజగతి పై మహామహుల కలాలు   తెలుగుజాతికి కోటి వరాలు
అమ్మభాషలోన మకరందం  పంచి చూడు అది అమృతభాష్యం
జాను తెలుగు లోని ప్రతిపదం  తెలుగుజాతికి జ్ఞానపదం
తెలుగుతలకట్టు మరువకది భావితరాలకు  తొలిమెట్టు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here