Site icon Sanchika

తిక్కలు

[dropcap]”ఎ[/dropcap]వురుపా నువ్వు” అంటా వాన్ని అడిగే అన్న.

“నేను ఎమ్మెల్యే వెంకన్న కొడుకునినా!”

“అవునా? సరేపా!”

“నువ్వుపా” అంటా వీని పక్క చూసే అన్న.

“నేను జమీందారు జిట్టన్న మనవడినినా”

“ఓ… అట్లనా?”

“ఊనా”

“సరే! నువ్వుపా?” అంటా అన్న నా పక్క చూసే.

“నేను అగరం వసంత్‌నినా” అట్లే అంట్ని.

“అహా! ఏమి గుర్తింపుపా నీది” అంటా అన్న నన్ని మెచ్చుకొనె.

అంతే వాళ్ళిద్దరికి రేగినట్లుంది. “మడి మాది” అంటా కిర్లిరి.

“రేయ్! మీరిద్రు మీ గుర్తింపులులా కాకుండా మీ అబ్బ, తాతల గుర్తింపులులా బతకతావుండారురా; బదుకుల పెద్దల గుర్తింపు వుండాలా, కాని కడదాకా ఆ గుర్తింపులానే బతకేయకూడదురా, మీ గుర్తింపులా మీరు బతికేది నేర్చుకొండ్రా తిక్కలు నాయాళ్లారా” అని పొయ అన్న.

***

తిక్కలు = పిచ్చి

Exit mobile version