తొక్కుడు బిళ్ళ

0
2

[dropcap]చి[/dropcap]న్నారి అనామిక అమ్మమ్మ దగ్గరకు హాలిడేకి వచ్చింది. అమ్మమ్మ దగ్గరకు వెళ్ళటం అనామికను చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మమ్మ ఇంట్లో హాలిడేస్‌లో చాల మంది కిడ్స్ వస్తారు తెలుసా? సో మెనీ. ఎందుకంటే అమ్మమ్మ కాలనీ లోని పిల్లలు, మెయిడ్స్, వర్కర్స్ పిల్లలకు ఫ్రీ గా హాలిడే ఆక్టివిటీ క్లాసులు చెబుతుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ తెలుసా” అంది అమాయకంగా, ఉత్సాహంగా.

“అలాగా! మరి ఈసారి ఏమి నేర్చుకున్నావు?” అంది మీనా ఆంటీ.

“This time? తొక్కుడు బిళ్ళ/hopscotch” అంది అనామిక.

“తొక్కుడు బిళ్ళ? అదేం గేమ్?” అన్నాను.

“అయ్యో! ఆంటీ నీకు తెలీదా? ఓకే. నేను చెబుతాను. విను” అంది అనామిక.

సరే అని చెట్టు నీడలో కూర్చున్నాము. చల్లని గాలి వీస్తోంది. వింటర్ విండ్. దగ్గర్లో ఉన్న పూలమొక్కలు, వెజిటల్ ప్లాంట్స్ మీద వాలి ఎగురుతున్న butterflies, bumble bees. గాలిలో కలిసిన పూల వాసన చాల హాయిగా ఉంది.

అనామిక చెప్పే స్టోరీ విందామా? రెడీ? రెడీ.

“ఆంటీ! This time అమ్మమ్మ మా అందరికి ఒక traditional game/ సాంప్రదాయ ఆటతో పాటు maths, మంత్స్, నేమ్స్ నేర్పించింది.”

“అవునా? హౌ? ఎలా?”

“రండి చూపిస్తా” అంటూ అనామిక ఆంటీని కొద్దీ దూరంలో ఉన్న రూమ్ దగ్గరకు తీసుకెళ్లింది. అక్కడ నెల మీద తొక్కుడు బిళ్ళ గేమ్ diagram paint చేసి ఉంది.

“ఆంటీ ఇక్కడ చూడు, 1-10 నంబర్స్ 5 టేబుల్, ఇక్కడ కూడికలు, ఇదో ఇక్కడ మంత్స్ పేర్లు, ఇక్కడ ఇక్కడ చూడు ఫ్లవర్స్, ఫ్రూప్ట్స్ నేమ్స్ ఉన్నాయి” అని పరిగెడుతూ హ్యాపీగా చూపించింది అనామిక.

“గ్రేట్ చాలా బాగున్నాయి” అన్నాను.

“ఈ గేమ్ ఎలా ఆడతారు?”

“ఆంటీ వెయిట్. ఇప్పుడు కిడ్స్ వస్తారు. అందరం ఆడటం చూడవచ్చు. అక్కలు/దీదీలు వచ్చి గ్రూప్స్ చేసి ఆడిస్తారు” అంది అనామిక.

“అక్కా!” అంటూ ఎదురువెళ్ళి పలకరించింది.

“హే! ఫ్రెండ్స్” అంటూ గుంపుగా వచ్చిన పిల్లలని పలకరించింది.

చెట్టు నీడలో కూర్చుని చూస్తున్న నా దగ్గరకు అనామిక అమ్మమ్మ వచ్చింది.

“పిన్నీ! అనామికా, ఆ పిల్లలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో కదా?”

“అవును. నువ్వు ఆట మాత్రమే చూస్తున్నావు. నేను ఆటతో పాటు చదువు చూస్తున్నా” అన్నారు అమ్మమ్మ.

 “పిన్నీ, అనామిక తొక్కుడుబిళ్ల ఆటలో అంకెలు అవి నేర్చుకున్నాము అంది. అదెలా?”

“మీనా, నీకు నువ్వు ఆడిన చిన్నప్పటి తొక్కుడు బిళ్ళ ఆట గుర్తుందా?”

“ఉంది పిన్నీ. గళ్ళు గీసి ఒక రాయి ముక్క లేక పెంకుని గడి లోకి విసిరి జంప్ చేస్తూ చివరి దాకా వెళ్ళేవాళ్ళము.”

“అదే బేసిక్ గేమ్‌ని మారుతున్న కాలానికి అనుకూలంగా పిల్లలకు ఆటలో చదువు చెప్పే ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి” అన్నారు అమ్మమ్మ.

“పిన్నీ! hopscotch/తొక్కుడుబిళ్ల ఆటలో ఎడ్యుకేషన్‌ని ఎలా ఫిట్ చేసావు?”

“మీనా! రా! చూద్దువు. ఇక్కడ చూడు” అన్నారు అమ్మమ్మ.

అక్కడ ఒక చోట స్క్వేర్, రౌండ్, షేప్ లతో కొన్ని చోట్ల రెండు గళ్ళు, ఒక గడి గీసి వాటిలో abcd లతో మొదలయి అంకెలతో ముగింపు. ఇంకోచోట తెలుగు వర్ణమాల. ఇంకో చోట రెండు అక్షరాలా పదం అంటే అల, ఆవు, ఇల లాంటివి గీసి ఉన్నాయి. పిల్లలు ఉత్సాహంగా ఆడుతున్నారు. బిగ్గరగా చదువుతున్నారు. ఇంకో గ్రిడ్‌లో బొమ్మలు పేర్లు ఉన్నాయి.

“పిన్నీ! wow. Innovative. పిన్నీ! తొక్కుడు బిళ్ల ఆట గురించి వివరంగా చెప్పవా?”

“తప్పకుండా. నువ్వు కూడా నేర్చుకుని, నీ ఊహని జోడించి మరిన్ని కొత్త hopscotch types చెయ్యి. మీనా నువ్వు చూస్తున్నట్లుగా hopscotch/తొక్కుడు బిళ్ల ఆడటానికి సరైన ప్రదేశం సెలెక్ట్ చేసుకో. ఏ సబ్జెక్టు చెప్పాలనుకుంటున్నావో నిర్ణయించుకో. అంకెలా, అక్షరాలా, పదాల, ఎక్కాలు, రంగులు, పేర్లు ఇలా ఎన్నో. వాటి ప్రకారం hopscotch గడులు గియ్యాలి. మొదటి గడి స్క్వేర్ సింగిల్, నెక్స్ట్ టాపిక్‌ని బట్టి two, one squares. ఫైనల్ గోల్ square‌ని హౌస్ అంటారు. అది సాధారణంగా semi-circle లా ఉండాలి. ఉంటుంది” అన్నారు అమ్మమ్మ.

“పిన్నీ! ఆట ఎలా ఎంతమంది ఆడాలి?”

“fixed నెంబర్ లేదు. టాస్ గెలిచిన ప్లేయర్ తన లక్కీ స్టోన్ లేదా వుడ్ ముక్కని ఫస్ట్ square లో దూరంగా ఉండి విసరాలి. అది సరిగ్గా మధ్యలో పడాలి. స్క్వేర్ అంచుల్ని తాకినా, బయటకి లేదా నెక్స్ట్ గడి లో పడ్డ అవుట్. నెక్స్ట్ ప్లేయర్ వస్తాడు.”

“పిన్నీ! ఆ తరువాత ఎలా ఆడాలి?”

“ఎలా అంటే? నీ గ్రిడ్ అదే squares ని బట్టి ఆడాలి. ఫస్ట్ గడిలో లక్కీ వేసాక నెక్స్ట్ గడి లోకి వన్ లెగ్ తో హాప్/గెంతాలి. నెక్స్ట్ 2 గడుల్లో ఒకేసారి రెండు కాళ్లతో హప్ చెయ్యాలి. ఎక్కడ లైన్ తగలకూడదు. హౌస్ స్క్వేర్ రీచ్ అయ్యాక వెనక్కి తిరిగి హప్ చేస్తూ రావాలి. ఫ్లోర్ తగలకుండా లక్కీని తియ్యాలి.”

“పిన్నీ గేమ్ ఓవర్ కదా?”

“నో. వేరే ప్లేయర్స్ ఆడాలి కదా. మిగతా వాళ్ళు చీర్ చేస్తుంటారు. కాన్సన్ట్రేషన్/ఏకాగ్రతతో ఆడాలి చివరి దాకా” అన్నారు అమ్మమ్మ.

“పిన్నీ! ఈ గేమ్ ఎంత పురాతనమైనది? హౌ ఓల్డ్?”

“నాకు ఖచ్చితంగా తెలీదు. కానీ నాకు తెలిసి వెరీ ఓల్డ్ గేమ్. సుమారుగా 17BC టైంలో బ్రిటన్‌లో ప్రారంభం అయ్యిందిట. అప్పటి గేమ్ గ్రిడ్ 100 అడుగుల పొడవు ఉండేదిట. మిలిటరీ ట్రైనింగ్‌లో సైనికులతో ఆడించేవారు. ఐ మీన్ ప్రాక్టీస్. సైనికులు ఆయుధాలు/వెపన్స్, ఇతర యుద్ధ సామాగ్రి పట్టుకుని గ్రిడ్‌లో ఇప్పటి గేమ్‍౬లా జంప్ చేస్తూ, హెవీ వస్తువులు మోస్తూ లైన్ తగలకుండా పక్కకి పడిపోకుండా ఒక్క లెగ్, 2 లెగ్స్‌తో జంప్ చేస్తూ బాలన్స్ చేసుకుంటూ హోమ్ చేరాలి. ఫెయిల్ అయితే. పనిష్మెంట్.”

“పిన్నీ! నువ్వు చెప్పేది ఊహిస్తుంటే భలేగా ఉంది” అంది మీనా.

“ఓకే. విను. Football ఆటగాళ్లు వాళ్ళ ఫుట్ వర్క్, స్కిల్ మెరుగుపరచుకోవటానికి ఇంప్రూవ్ చెయ్యటానికి ఎలాగైతే ట్రక్ టైర్స్ లైన్‌లో జంప్ చేస్తారో అలాగట.”

“ఓహ్! మరి గేమ్ ఎలా అయ్యింది?”

“సింపుల్. పిల్లలు చాల బాగా అనుకరిస్తారు కదా! Good at imitation. సో సైనికులు చేస్తున్న ప్రాక్టీస్ చూసిన బ్రిటిష్, రోమన్ పిల్లలు గ్రిడ్‌ని వాళ్లకి సులువుగా ఉండేలా మోడిఫికేషన్/మార్పులు చేసి రకరకాల థీమ్స్‌తో ఆడేవారు. పిల్లలు ఎవ్వరు బాగా ఆడారు అని స్కోర్ పెట్టేవారట. అలా ఈ గేమ్ యూరోప్‌తో పాటు ప్రపంచం అంతా పాపులర్ అయ్యింది.”

“గేమ్‌కి పేరెలా వచ్చింది?”

“బ్రిటన్‌లో 17 బీసీలో ఆడటం స్టార్ట్ అయ్యినప్పుడు దాన్ని scotch – hoppers అన్నారట.. 1635లో ఫ్రాన్సిస్ విల్లింగ్ బై రాసిన బుక్ అఫ్ గేమ్స్ లో గేమ్ రూల్స్, ఎలా ఆడాలి ఉందిట.”

“అవునా?”

“1828 లో Webster dictionary లో గేమ్ ని mention చేశారట.”

“పిన్నీ! అన్ని దేశాల్లో ఒకేలా ఆడతారా?”

“లేదు. కొన్ని మార్పులున్నాయి. పేర్లు కూడా లోకల్. ఇండియాలో stapu, nondi, కిత్ కిత్, కుదుళ్ళు, తొక్కుడు బిళ్ళ అంటారు. టర్కీలో sek sek అంటారు. అంటే జంప్ విత్ వన్ ఫుట్. మలేసియాలో teng teng. ఇలా ఒక్కో దేశం ఒక్కో పేరు. బీదరికం, బడికి వెళ్లే వీలు లేని పిల్లలు అన్ని వసతులున్న స్కూల్స్ కి వెళ్లే పిల్లలని కలిపి ఈ గేమ్‌తో చదువురాని, చదవాలనే పిల్లలకు బేసిక్స్ నేర్పిస్తాను. అటు చూడు వెల్ టు డు ఫామిలీ పిల్లలు ఇష్టంగా, ప్రేమగా పేద పిల్లలకి చదవటం నేర్పిస్తున్నారు.”

“ఫామిలీస్ ఆబ్జెక్ట్ చెయ్యలేదా?”

“Why? In fact sharing is caring అని చెప్పటం కాదు. నిజంగా పిల్లలకి అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చెయ్యటం, వాళ్ళని ఆదరించటంలో ఉన్న మజాని నేర్పాలి. నీకు తెలుసా నా ఈ వీకెండ్ ఆక్టివిటీ క్లాస్‌కి రావటానికి అందరు ఇష్టపడతారు. వాళ్లకి తెలిసింది నేర్పటానికి ఉత్సాహపడతారు. ఇటు చూడు పిల్లలే collect చేసి maintain చేస్తున్న లైబ్రరీ, బుక్స్, టాయ్స్, సమస్తం. గేమ్స్ మెయిన్ ఆబ్జెక్ట్ ముఖ్య ఉద్దేశం సమూహంగా కలసి ఉండటం. ఆర్ధిక అసమానతలు/disparities లేకుండా ప్రేమగా పిల్లలు ఆడుకోవటం చూస్తే ఆనందం కలుగుతుంది.”

“అవును పిన్నీ. So true. నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. పిన్నీ ప్లీజ్ నాకు మన సంప్రదాయ, ఇతర మీనింగ్‌ఫుల్ గేమ్స్ నేర్పించు.”

“తప్పకుండ. పిల్లలు! టైం ఓవర్. రండి. ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తినండి” అని పిలిచారు అమ్మమ్మ.

పిల్లలకు బెల్లంతో చేసిన పల్లి లడ్డు, అరటి పండు ఇచ్చారు తినటానికి.

“ఆంటీ! మా గేమ్స్ చూసారా? నచ్చిందా?” అని అడిగింది అనామిక.

“చాలా చాలా” అని అనామికని దగ్గరకు తీసుకుంది మీనా ఆంటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here