[dropcap]దం[/dropcap]డెంరాజు ఫౌండేషన్ వారు నిర్వహించిన చిరు నవలల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన ‘తొలగిన తెరలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. విజయనగరంకు చెందిన ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు ఈ నవలని వారణాసి నేపథ్యంలో రచించారు.
***
చాలా రోజుల క్రితం స్పందన తను పనిచేసే కంపెనీలో ఒక వర్క్‌షాప్ ఏర్పాటుచేసింది.
సమాజంలోని విభిన్న వృత్తి – ప్రవృత్తులలో ఉన్న మహిళలందరికీ వారి అనుభవాలను పంచుకునే అవకాశంతో పాటు తాము ఈరోజు ఇంత గొప్ప స్థాయికి చేరేందుకు సహాయపడిన వ్యక్తులను గురించి లేదా ఆటంకాలు ఏర్పడితే వాటిని ఎలాగా ఎదుర్కొన్నారు? అనే విషయాలను ఒక కాగితంపై ప్రశ్నావళి తయారు చేసి పదిహేను నిమిషాలలో వ్రాయడానికి అందించింది.
మన గురించి అడిగేవారెవరుంటారు? అని అందరూ ఇమోషనల్ అయ్యారు.
నిజంగా మన గురించి, మన గడిచిన జీవితం గురించి తలచుకుని కాగితంపై పెట్టాలి అంటే ఒక పరీక్షా సమయమే!
అయినప్పటికీ ఎందరో మహిళలు విభిన్న వృత్తులవారు విభిన్న వయసుల వారు తమ చదువు గురించి ఉద్యోగం గురించి అనుభవాలను రాయాలని ప్రయత్నించి పదిహేను నిమిషాలకు బదులుగా అరగంట తీసుకున్నారు.
స్పందన అందరి దగ్గరా రాసిన కాగితాలను తీసుకుని వారు రాసిన దాని గురించి మాట్లాడమని ఒక్కొక్కరికీ పది నిమిషాల చొప్పున సమయం కేటాయించింది.
నిజంగా అది ఒక అపూర్వ అనుభవం.
***
ఆసక్తిగా చదివించే ‘తొలగిన తెరలు’ ధారావాహిక వచ్చే వారం నుంచే..
చదవండి.. చదివించండి..
‘తొలగిన తెరలు’