Site icon Sanchika

తోలతా

[dropcap]”చ[/dropcap]ల్లని గాలి, చక్కని చెట్లు, చెంద్రోదయం కాని సాయంకాలం. చిన్నదోవలో సైకిలు పైన పెండ్లాం బిడ్డలను కూకోబెట్టుకొని హాయిగా, ఆనందముగా తన జీవిత క్షణాలను దాటతా వుండాడు రామన్న.”

“చిన్న కారులా చెంద్రన్న పెండ్లాం బిడ్డల మాటల్ల మునిగి మైమరిచి పోతావుండాడు.”

“నడచి పోతా కాకన్న, కుణసలాడతా గోపన్న, కుటాణిలా వక్కాకు దంచతా కూరేశి కాశవ్వ… కాలంలా కదిలి పోతావుండారు.”

“పెద్ద కారులా సాకన్న, కారు తోలతా డ్రైవరు… డ్రైవరు పక్క సీట్లో ఓనరు (సాకన్న), వెనక సీట్లో పెండ్లాం బిడ్డలు, ఎవరి అందాజుల్లా (ఆలోచనలు) వాళ్లు… ఏదో పోతావుండారు.”

“కారు డ్రైవరు మాత్రం తనదే కారు అయినట్టు ఆనందము పడతా తన జీవిత క్షణాలని అనుభవిస్తా కారు తోలతా పోతావుండాడు.”

***

జీవితమంటే జీవించడం మాత్రం కాదు.

అనుభవించడం కూడా…. క్షణక్షణాన్ని… తిరిగి రాని కాలాన్నీ.

అది ఎట్లని రామన్నకి, చంద్రన్నకి, కాకన్నకి, గోపన్నకీ, కూరేశి కాశవ్వకి, కారు డ్రైవరుకి బాగా తెలుసు.

ఆస్తి దాచుకొనే పనిలా వుండే సాకన్నకి ఏం తెలుసు? ఎట్ల తెలుసు?

***

తోలతా = నడపతా

Exit mobile version