[శ్రీ సాహితి రచించిన ‘తొలి ప్రశ్నకే శిక్ష’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఏ[/dropcap] నిజమైనా
మనసును క్షమించదు.
జ్ఞాపకమై ప్రశ్నలా
వెలితిలా మిగిలి
కంటి గూటిలో
నిద్ర లేని కలలో మేల్కొని
ఊపిరి నడిబొడ్డులో
మనసు గొంతుకలో
ప్రవహించే ప్రేమ రోజులు గడచి
లోతు పెరిగిన అనుభవమే
తొలి పాఠంగా
తొలి ప్రశ్నకే శిక్ష పడటం విచిత్రం
ప్రేమ సమక్షంలో
భయపడే నిజంగా
ఇష్టమే తనుకి తానుగా
తప్పులా తప్పుకుంది .