[box type=’note’ fontsize=’16’] “జ్ఞాపకాలను తట్టిలేపే పురాతన కట్టడాలు, కనుచూపుమేర ఆవిష్కృతమయ్యే అద్భుత దృశ్యాలు, విస్తుపోయేలా ఉన్న ప్రపంచ వింతలు, రయ్యిన దూసుకుపోయే పొడవైన రహదారులు.. వేలాది మందిని తనలో దాచుకున్న భూగర్భ నగరాలు.. వీటన్నింటిని తలదన్నేలా ఉన్న ఆధునిక వాణిజ్య సముదాయాలు.. అన్నీ కలిసి ఒకేసారి ఊరిస్తూ… రా రమ్మల్ని పిలుస్తుంటే ఎవరైనా వెళ్ళకుండా ఉంటారా… అదుగో అలా మమ్మల్ని ఊరిస్తూ… ఎప్పుడెప్పుడు అక్కడ వాలిపోతామా అనేలా చేసిన ఆ దేశం టర్కీ” అంటూ టర్కీ గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]
అండర్ గ్రౌండ్ నగరం
[dropcap]అ[/dropcap]క్కడికి దగ్గరలోనే ‘డెరింకియు’ అనే ప్రదేశంలో అండర్ గ్రౌండ్ నగరం ఉందంటే దాన్ని చూడటానికి వెళ్ళాము. ఈ నగరం 200 అడుగుల లోతుల్లో ఉంది. ఒకప్పుడు ఇది 20 వేల మందికి నివాసమట… యుద్ధాలు జరిగేటప్పుడు తలదాచుకోవడానికి ఈ నగరాన్ని ఉపయోగించేవారట. టర్కీ లోని అతిపెద్ద భూగర్బ నగరం ఇది. యాత్రికులకు ఈ ప్లేస్ 1969 నుండి ఓపెన్ చేశారు. ఈ సిటీని 7వ శతాబ్దంలో ఇండో యురోపియన్ కు చెందిన ఫ్రైజీయన్స్ నిర్మించి ఉంటారని టర్కీస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అంచనా. బైజాంటిన్ కాలంలో ఈ నగరం పూర్తిగా నిర్మించారట. అయితే ఎనిమిదో అంతస్తులున్న సందర్శకులకు నాలుగో అంతస్తు వరకూ మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఈజిప్టులోని పిరమిడ్లకు అనేక ఏండ్లు లక్షల మంది కష్టపడితే ఈ భూగర్భ నగరాల నిర్మాణాలకు ఇంకెన్ని లక్షల మంది పనిచేసి ఉంటారనేది ఉహాకు అందని విషయం.
తర్వాత మేము ఒక పెయింగ్ గెస్ట్‌ల్లా ఒక ఇంట్లో ఉన్నాము. ఒక ముసలివాళ్లు మాకు పెయింగ్ గెస్ట్ గా వసతి ఇచ్చారు. వాల్లే మాకు అన్నీ పదార్థాలు వండి పెట్టారు. వాళ్ళ వంటలు కూడా మన ఇండియాలో ఉన్నట్లుగా చాలా స్పైసీగా ఉన్నాయి. రుచికరమైన భోజనం పెట్టారు. వారే మాకు మంచి గైడ్స్ లాగా కూడా పనిచేశారు. వాళ్ళు రెండో రోజు మాకు ఏం చెప్పారంటే ఒక వాకింగ్ టూర్ ఉంది, మీకు తప్పకుండా వెళ్ళండని చెప్పారు. సో మేము రెండో రోజు వాకింగ్ టూర్‌కు వెళ్ళాము. ఈ వాకింగ్ టూర్లో ఆ అబ్బాయి మమ్మల్ని అడవిలోకి తీసుకెళ్ళి అక్కడున్న గుహలు చూపించాడు. ఆ గుహలు ఎన్నో శతాబ్దాల క్రితం ఈ క్రైస్తవులు అరబ్ సైనికుల నుండి తప్పించుకోవడానికి ఆ కొండలలోకి వచ్చి చర్చిలను నిర్మించుకున్నారంట. ఆ కొండలలో, ఆ చర్చిలకు చక్కటి పెయింటింగ్ వేసివున్నాయి. ఆ పెయింటింగ్స్ అన్ని చూస్తూ పొద్దున మేము ఆరుగంటలకు మా ప్రయాణాన్ని సాగిస్తే మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఆల్మోస్ట్ 14 కిలోమీటర్లు నడిచాము. ఆ నడిచేటప్పుడు ఆ ఆడవిలో చాలా ఔషద మొక్కలు ఉన్నాయి. వాటిని చూపిస్తూ ఆ దేశపు నాగరికతలను, ఆ దేశపు చరిత్రను చెపుతూ వచ్చాడు. తర్వాత మేము అక్కడినుంచి ఒక పర్వతం పైకి వెళ్లాము. అక్కడ పావురాలు అన్ని గూళ్లు కట్టుకొని ఉన్నాయి. దీన్ని పీజియన్ కార్నర్ అంటారు. ఇక్కడ మాకు ఒక గాజులో చేసినవి, చుట్టూ వైట్‌గా, నీలం రంగుతో ఉన్న హ్యాంగింగ్ అంటే మనము గోడకు తగిలించుకోవడానికి అందమైన గాజుతో తయారుచేసిన బొమ్మలు కనిపించాయి. ఇవి ఎందుకూ అని అడిగితే అక్కడ వారు చెప్పారు దిష్టి తాకకుండా గాజు బొమ్మల్ని ఇంట్లో తగిలిస్తారంట. నిజంగానే నేను ఎన్నో ఇండ్లు చూశాను అన్నీ ఇండ్లలోకూడా ఈ గాజుతో తయారుచేసిన దిష్టిబొమ్మలు ఉన్నాయి. బొమ్మ అంటే బొమ్మ కాదు కానీ ఇది గుండ్రంగా ఉన్నాయి. నేను కూడా ఒకటి కొనుకున్నాను. అక్కడినుండి మేము ఈ పర్వతాలన్ని ఎక్కుతూ, దిగుతూ సాయంత్రం వరకూ సిటీ అంతా తిరిగాము.
పముక్కలే
తర్వాత మేము కపడోకియా నుండి పముక్కలే అనే ప్లేస్‌కి వెళ్లాము. ‘పముక్కలే’లో మంచుతో కప్పబడిన పర్వతాలు.. కనువిందుచేసే సెలయేటి ఒంపులు ఇక్కడి ప్రత్యేకతలు. అది తొమ్మిది గంటల ప్రయాణం. ఒక బస్సు తీసుకొని సాయంత్రం చేరుకున్నాము. వందల మీటర్ల ఎత్తు ఉండి, నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో సహజంగా ఈతకొలనులాంటి సున్నపురాయి కొండ ఉన్న ప్రాంతం అది.
పాల నురుగలాగ మెరుస్తుంటే ఎంత అందంగా ఉంటుందో అలా రాయి మొత్తం మంచు కొండల్లాగా ఉంది. మేము దగ్గరకు వెళ్ళి దాన్ని తాకి చూస్తే తప్ప అది మంచు కొండలు కాదు సున్నపు రాయి అని అర్థమయ్యింది.
పముక్కలే మంచు కొండల మధ్యన కొన్ని చిన్న చిన్న నీటి చెలమలు ఉంటాయి. స్థానిక వాతావరణానికి అనుగుణంగా ఈ నీటి ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటాయి. వేసవి కాలంలో చుట్టూ మంచు ఉన్నప్పటికీ, ఆ మంచు కరగదు. ఈ చెలమల్లోని నీరు వెచ్చగా ఉంటుంది. ఆ సమయంలో ఈ నీటిలో స్నానం చేస్తే రక్తపోటు, నేత్ర, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ఇక్కడి స్థానికుల నమ్మకం. ఇందులో స్నానం చేయడం మంచిదని యూరోపియన్లు కొన్ని శతాబ్దాలుగా నమ్ముతున్నారు. ఈ నమ్మకం కూడా పముక్కలేకు పర్యాటకులు ఎక్కువగా రావటానికి ఒక కారణమట. ఒకవైపు ప్రకృతి సౌందర్యం, మరోవైపు చెలమలలో స్నానం ఇవి పముక్కలేకు మాత్రమే సొంతం అనిపించింది నాకు.
నాకు ఎంతగానో నచ్చిన ఈ పముక్కలే ప్రదేశాన్ని ప్రపంచంలో ఉన్న ఒక వింతగా నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే నేను ఎక్కడా ఇన్నిన్ని కొండల్లాగా కార్బనేట్‌తో తయారయినదాన్ని చూడలేదు. ఒక్కొక్కొ నీటి చుక్కతో ఏర్పడిన ఈ కొండ ఎన్ని సంవత్సరాలు అయిందో ఉహకే వదిలేస్తున్నాను. మంచుకొండల్లో అయితే మనం ఆ చలికి వణుకుతూ ఫోటోలు తీసుకోవాలన్నా కష్టపడతాము కానీ ఇక్కడ ఎన్ని ఫోటోలు కావాలన్ని తీసుకోవచ్చు. అసలు ఎంత ఆనందంగా ఉండిందంటే అంత ఆనందంగా ఉండింది నాకు. దాని మీద పరిగెత్తాను. అసలు అక్కడినుంచి కదలబుద్ది కాలేదు. దాదాపు రెండు గంటలు అక్కడే కూర్చున్నాను.
కాళ్ళతో తొక్కితే వైన్…!
తర్వాత మేము అక్కడినుండి ‘కుసదసి’ అనే స్థలానికి చేరుకున్నాము. ‘కుసదసి’ అంటే ‘బర్డ్స్ ఐలాండ్’ అని అర్థం. ఆక్కడ గ్రేప్స్‌తో చేసిన ద్రాక్షరసం చాలా బాగుంటుందని చెప్పారు. సరే అక్కడొక్క ప్యాకేజ్ టూర్లో వాకింగ్ టూర్ లాంటిది తీసుకొని ద్రాక్షతోటలు ఉన్న ప్లేస్‌కి తీసుకెళ్ళారు. ఆ చెట్లనుంచి తీసిన తాజా ద్రాక్ష పళ్లనన్నింటిని ఒక తొట్టిలో వేసి యాత్రికులకు రబ్బరు బూట్లు వేయించి తొక్కిస్తారు. అలా తొక్కుతూ ఉంటే దాంట్లో ఉన్న రసమంతా వారు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నారు. అలా తీసుకున్న రసాన్ని వాళ్ళు వైన్‌గా తయారు చేస్తున్నారు. అక్కడికి వేల మంది ప్రయాణికులు వచ్చారు. అక్కడికి వచ్చిన ప్రయాణికులంతా ఈ వైనను టేస్ట్ చేస్తున్నారు. ఈ ప్రదేశమంతా పైనుండి కిందకి దిగే జలపాతాలాగా ఇండ్లు కట్టి ఉన్నాయి. ప్రతి ప్లేస్ చాలా కింది వరకూ ఉంది. ఆ కొండలన్ని ఎక్కుతూ, దిగుతూనే ఉన్నా ఆ రోజంతా. ద్రాక్ష చెట్టు ప్రతి ఇంట్లో ఉన్నాయి. ఆ నగరాన్ని చూస్తే ఎంతో అందంగా అనిపించింది.
కూశాద్ అసిలో సాయంత్రం సూర్యాస్తమయ్యాన్ని తప్పని సరిగా చూడాల్సిందే. సూర్యాస్తమయం ఎంత అందంగా ఉందంటే నూర్యుడు రకరకాల వర్ణాలలో మారే విధానాన్ని వర్ణించడం ఎవరి తరం కాదు. నీలి రంగు నీళ్లు, పైన ఎర్రటి సూర్యాస్తమయం అద్భుతంగా ఉంది. దగ్గర్లో ఒక బీచ్‌కి వచ్చాము. ఇది లేడిస్ బీచ్. ఇది 52 కిలోమీటర్లు పొడవుగా ఉంది. ఇక్కడ 5 స్టార్, 7 హోటల్స్, రిసార్ట్స్ కట్టి ఉన్నాయి. ఇక్కడ అంతా తీరం ఎంత కనువిందు చేసిందంటే చెప్పనలవి కాదు. అక్కడికి వెళ్ళి ఆ నీళ్లల్లో దిగి చక్కగా ఆడుకొని మేమిద్దరం బయలుదేరాము.
పాలరాతి వైభవం… ఎఫెసుస్…
దాన్ని చూసాక మేము ‘ఆర్టేమిస్’ అనే దేవాలయం చూద్దామని వెళ్ళాము. ఆ దేవాలయానికి ఆనవాళుగా ప్రస్తుం ఒకటే శిలాస్తంభం మిగిలింది. తర్వాత వర్జిన్ మేరీ నివసించిందని చెప్పబడుతున్న ప్రాంతానికి వెళ్ళాము. ఇది పైన కొండమీద ఉంది. ఈ కొండ పైకి వెళ్ళే సరికి అక్కడ అందరూ క్రైస్తవులు, ముస్లింలు ఆరాధించే మేరీ మాతకు ప్రతిరోజు 5సార్లు ప్రార్ధనలు జరుగుతాయంట. ఈ ఎఫసెస్ అనే లైబ్రరీ శిథిలాలను చూశాము. మరుసటి రోజు మేము కుసదసి నుండి మేము ఇజ్ మీర్ కి బస్లో వెళ్ళి ఇస్తాంబుల్ చేరాము.
టాప్ కోపి ప్యాలెస్ మ్యూజియం…
టర్కీ మాత్రం నాకు చాలా చాలా నచ్చేసింది. ఎన్ని ఎండ్లు అయినప్పటికీ కూడా నేను ఆ పముక్కలే అనే ప్రదేశాన్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను.
కపడోకియా కూడా ప్రపంచంలో మనం ఎక్కడా చూడలేని వింత. ఇంకొకటి ఏమంటే ప్రాచీనకాలంలో క్రీ.పూ 300 కాలంలో వాళ్ళు వాడిన బాత్రూమ్స్, టాయ్లెట్స్ చూశాము. ఈరోజుకు కూడా వాటిని ఉపయోగిస్తున్నామంటే అప్పట్లోనే వాళ్లు – ఎంత మంచి నాగరికతలని సంతరించుకున్నారో మనకి అర్థమవుతుంది. ఇవన్నీ చూసాక, ఆ ఇస్తాంబుల్ మర్చిపోలేని ఒక కలగా నిలుస్తుంది.