[dropcap]ప్ర[/dropcap]పంచం అల్లకల్లోలమై
గుండెలు బద్దలై
మనసులు బరువై
జీవచ్ఛవంలా బ్రతుకై
భయంతో ఆసుపత్రి పాలై
లక్షల్లో డబ్బులు ఖర్చులై
బ్రతుకు శాపమై, శ్వాస భారమై
అమరులై, చివరి వీడ్కోలు కూడా కరువై
దేముడి ఉనికే కనుమరుగై
చదువులు ఆన్లైన్ పరమై
రవాణా నామమాత్రమై
షేర్ మార్కెట్ పతనమై
జనం యింటికే పరిమితమై
వంట గదులే ప్రయోగశాలలై
మాస్క్ శరీరంలో భాగమై
శానిటైజర్ చేతులకు ఆభరణమై
శుభ్రతే పరమావధియై
ఆనందాలు శూన్యమై
పెళ్లిళ్లు పేరంటాలు మితమై
మనుషులు కలయికే కష్టమై
స్మార్ట్ ఫోన్‌ల వాడకాలు ఎక్కువై
అభద్రతే చేరువై
వై దిస్ ‘యిరవై యిరవై’ !!
భూగోళ మంతా ‘కరోనా జపమై’!!