Site icon Sanchika

ఉగాది బాలల కథల పోటీ – ప్రకటన

సహజ సాంస్కృతిక సంస్థ (రి.686/2008) విజయనగరం వారు బాలల కథల పోటీకి కథలను ఆహ్వానిస్తున్నాము.

కథలు పిల్లలకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఆలోచనలను రేకెత్తించేవిగానూ, బంధాలు కరుణ దయ కలిగి ఉండేలా కథలు మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలన్నారు.

కథల నిడివి చేతివ్రాతలో మూడు పేజీలు, డి.టి.పి.లో రెండు పేజీలు మించరాదు..

పోటీకి పంపించే కథలు ఇదివరలో ఏ పత్రికలోనూ ప్రచురణ కానివి, పరిశీలనలో లేనివి, కథ తమ స్వంతమేనని హామీ పత్రం తప్పనిసరిగా జత పరచాలి

కథల ఎంపికలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.

పోటీ స్థాయికి కథలు లేనప్పుడు పోటీని, లేదా అందులో ఏదైనా బహుమతిని రద్దు పరిచే అధికారం సంస్థ కలిగి ఉంది.

బహుమతి పొందిన కథలను మరియు పోటీకి వచ్చిన కథల్లో మంచి వాటిని విజయనగరం నుంచి వెలువడే “నాని” పిల్లల మాసపత్రికలో ప్రచురిస్తారు. అలా ప్రచురణ అయిన వాటికి ఎలాంటి పారితోషికము ఉండదు.

కథలను పోస్టు ద్వారా గాని కొరియర్ ద్వారా గాని మాత్రమే స్వీకరిస్తారు. ఈమెయిలు, WhatsApp ద్వారా కథలు స్వీకరించబడవు.

కథలు పంపాల్సిన చిరునామా

అధ్యక్షులు,
సహజ సాంస్కృతిక సంస్థ,
24 – 8 – 1, సమీరా రెసిడెన్సి,
లింగ దారి పేట, రాజ్యలక్ష్మి థియేటర్ దరి,
విజయనగరం 535002.

కథలు చేరడానికి ఆఖరి తేదీ 20 – 2 – 2019. ఫలితాలు 6 – 4 – 2019 తేదీ ని ప్రకటిస్తారు.

బహుమతి ప్రధానం తేదీ 21-4-2019 న, విజయనగరంలో ఉంటుంది. హాజరు కాలేని విజేతలకు నగదు అకౌంట్లో జమ చేయబడుతుంది.

Exit mobile version