[dropcap]వ[/dropcap]సంతాగమనం
వచ్చింది ఉగాది
పండగ తెచ్చింది
చైత్ర మాసంలో వచ్చింది
చెట్టుకొమ్మ చిగురించింది
కాలగమనం మెుదలైంది
కోకిలమ్మ గొంతు విప్పింది
కొత్త సంవత్సరం వచ్చింది
యుగాది పండుగ తెచ్చింది
తీపి వగరు చేదు పులుపు
ఉగాది పచ్చడి చేయండి
ఊరంతా పంచండి
పంచాంగాన్ని వినండి
పరిపూర్ణంగా జీవించండి