[dropcap]వ[/dropcap]సంతాలు కురిపించడానికి
జీవితాలను నడిపించడానికి
వచ్చిన పండగే…
ఉగాది, తెలుగు సంవత్సరాది
బ్రతుకు బాటలో, వెతుకులాటలో
మార్గాన్ని చూపించడానికి వచ్చిన
మార్గదర్శి… ఉగాది.
ఉగాది, తెలుగు సంవత్సరాది
జీవితంలో తీపిని, సంతోషాన్ని
చేదును, దుఃఖాన్ని
కోపాన్ని, అహంకారాన్ని
ఇలా… షడ్రుచులు చూపించడానికే
వచ్చింది… ప్రతి సంవత్సరం వస్తుంది
ఉగాది, తెలుగు సంవత్సరాది
మనిషిలోని మంచినతనం,
ప్రేమతత్వం, సద్గుణం
తెలియజేస్తున్నటు వంటి
‘ఉగాది పచ్చడి రుచి’
మూడు పువ్వులు, ఆరుకాయలు
కలిగి యున్న, పచ్చని చెట్టును
సూచిస్తున్నది, అదే
ఉగాది, తెలుగు సంవత్సరాది
నిత్య నూతనంగా, పచ్చతోరణముగా
కళకళా మెరిసే కనువిందులతో
తళతళా మెరిసే చిరునవ్వులతో
ఆనందం పట్టలేక
అందరినీ ఆహ్వానిస్తున్న
ఈ ఉగాది వేడుకలు
మనసుకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని
అందజేస్తున్నాయి.
ఇదే…
నా హృదయ పూర్వక
వందన సమర్పణ.