Site icon Sanchika

ఉమ్మడి పాలమూరు జిల్లా కవులకు, కళాకారులకు ఉగాది పురస్కారాలు 2024 – వార్త

[dropcap]కు[/dropcap]రుమూర్తి దేవస్థానం ఆధ్వర్యంలో బెల్లం సత్యమ్మ ట్రస్టు నిర్వహణలో 31 మార్చి 2024 న చిన్నచింతకుంట మండలం కురుమూర్తిలో ఉమ్మడి పాలమూరు జిల్లా కవులకు, కళాకారులకు ఉగాది పురస్కారాలను అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ న్యాయవాది వి.మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కవులను, కళాకారులను గుర్తించి కురుమూర్తి దేవస్థానం వారు ఉగాది పురస్కారాలను అందజేయడం అభినందనీయమన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతోమంది కవులు, కళాకారులు ఉన్నారని వారిని ప్రోత్సహించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం బెల్లం సాయిలు గొప్పదనమని ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.

సభకు అధ్యక్షత వహించిన దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి మదనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని కవులను, కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉగాది పురస్కారాలను ప్రతి సంవత్సరం ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమం రూపకర్త ప్రముఖ నటులు ప్రముఖ నటులు బెల్లం సాయిలు మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయస్థాయిలో పేరెన్నికగన్న కవులను, కళాకారులను గుర్తించి వారికి ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారాలను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సాహిత్యరంగంలో డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, కె. వీణారెడ్డి, కే. లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ వెల్దండ వెంకటేశ్వరరావు, టి. అంబుజ, బండారు సునీత, బోల యాదయ్య, చిత్రకళా రంగంలో జమాల్‌పూర్ మహేష్, హరికథా గానంలో పద్మాలయాచార్య, నాటకరంగంలో వి. పాండురంగాచారి, కొల్లాపూర్ వెంకటేష్, ఆమని కృష్ణ, అచ్చంపేట వెంకటేష్ తదితరులను మెమెంటో, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

వీరితో పాటుగా వివిధ సామాజిక విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి సామాజిక సేవారంగ అవార్డులను బహకరించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో సునీల్ కుమార్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version