[dropcap]వే[/dropcap]లకొలది విద్యార్ధులు
అందరిదీ ఒకటే యూనిఫారం
ప్రతి యూనిఫారం వెనుక
ఒక హృదయం
ప్రతి హృదయం
వెనుక ఒక ఆలోచన
ఒక ఆవేదన
ఎందుకో?
ఏం చేయాలనో?
ఆర్జించాలని ఒకరు
అర్చించాలని ఒకరు
అర్పించాలని ఒకరు
ఒక్కొక్కరిదీ ఒక్కో తపన
పైకి మాత్రం వారంతా ఒకటే
ఒక యూనిఫారం వెనుక
రాజకీయం రూపు దిద్దుకుంటే
మరో యూనిఫారం వెనుక
రాక్షసత్వం రాగులుతుంటుంది
యెంత గంభీర భావాన్నయినా
సీక్రెట్‌గా దాచేసే
శక్తుంది దానికి
నేడు గడిస్తే గాని తెలియదు
ఏ పుట్టలో ఏ పాముందో
ఒక నేత, మన సీతి గాడు
ఒక కర్త, మన కోటిగాడు
ఒక వైద్యుడు, మన వెంకి గాడు
ఒక నటుడు, మన నరిసిగాడు
అంతా ఈ యూనిఫారం వెనుక
ఒకప్పుడు దాగున్నారు
విల్లందరినీ తయారు చేసింది
ఈ యూనిఫారమే
గురూపదేశం అందరికీ ఒకటే
పరిశ్రమ వారిని మనుషుల్ని చేసింది.
ఒక సీతి గాడు నేత అయితే ,
ఈ యూనిఫారమే కాలరెగరేసింది.
ఒక నరిసిగాడు నటుడిగా మారితే,
ఈ యూనిఫారమే,
ఆనందాశ్రువులు రాల్చింది .
ఇదే ఇదే ఈ యూనిఫారమే,
మనుషుల్ని చేసింది
మనుషుల్లో మనీషిని చేసింది.