Site icon Sanchika

ఉపనయనము

[డా. జొన్నలగడ్డ మార్కండేయులు రచించిన ‘ఉపనయనము’ అనే వ్యాసం అందిస్తున్నారు.]

[dropcap]బ్రా[/dropcap]హ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు ప్రచారములో ఉన్నాయి. అష్టాదశ కులములు ప్రశంస తహతహ అగ్ర బలహీన వర్గాల రాజకీయ ప్రయోజన జనాభా గణన పరిగణనకు అవగాహనగ తప్పుపట్టలేము. కాని కులాచారముల వారసత్వ ధర్మానుసరణ ఐచ్ఛికము. వృత్తిని బట్టి వచ్చిన పేరుగ బ్రాహ్మణులందరు వేదము చదువరు. శ్రౌత స్మార్త వేదవిద్యగ పౌరోహిత్యవృత్తి స్వీకరించరు. క్షత్రియులకు విల్లంబులు, కృపాణము ధరించి నిలవాల్సిన ప్రత్యేక రణరంగాహ్వాన యుద్ధ క్షేత్ర బరి లేదు. వైశ్య కులాచారము వ్యాపార వాణిజ్య శేముషి వారికే పరిమితమైనదని నేటికాలంలో నిరూపణ చేయలేము. అందరూ కూడ అగ్రవర్ణాల భావన. ఆధునికీకరణ సంస్కృతిగ కులాచారములు ధ్వన్యాత్మక చాతుర్వర్ణ వ్యవస్థ భిన్నత్వంలో ఏకత్వము. వేద ధర్మానుసరణ కులప్రశస్తి కులములుగ ప్రజాప్రజాస్వామిక భారతదేశము మనది. ఉపనయన వేడుక గౌరవింప దగినది. ఉపనయనము అంటే యజ్ఞోపవీతధారణ వేడుక పరిమితమైన ఆహ్వానముగ కులధర్మానుగతమైనవి.

ముఖ్యంగ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులవాచకములలో sacred thread ceremony ఆహ్వానముగ బ్రహ్మచారి మగపిల్లలుకు పండుగ వాతావరణము ఉపనయనము. వేడుకగ అనువంశిక ఆచారము. కులాహంకారము ఆచార నిరూపణ ధ్వన్యాత్మక వేడుక ఉత్తరాయణ కాలము. బంధుమిత్ర సపరివార సందడిగ ఈ మూడు కులాలలో ప్రాచుర్యముగ సాగుతుంది. ఉపనయన ఆవశ్యకత సంప్రదాయ ప్రస్తావన వేడుకగ అనువంశిక ఆచరణ వివరణగ తప్ప సమగ్ర సమాచార శాస్త్రీయ అవగాహన సమర్థనీయంగ ఈ వ్యాస రచన అని భావించవద్దని మనవి.

లెక్కలేనన్ని శూద్ర విభాగాల కులములుగ కూడ ప్రజాస్వామిక ప్రజాప్రతినిధుల మధ్య అగ్రవర్ణాల భావన చాతుర్వర్ణ వ్యవస్థను దాటేసింది. ఉయ్యాల జంపాల హెచ్చుతగ్గులు నడుమ ద్విజన్మగ ఉపనయన సంస్కృతి ఆదర్శప్రాయ ధర్మానుసరణ మూడు కులాలకు మాత్రమే Sacred Thread Ceremony గ దిగుమతి. దుష్ట సమాస ఇంగ్లీషు భాష పదము. ఉపనయనము వేడుక పరిమితమైన సంస్కృతిగ ఆసక్తిగ చదివిస్తుంది. విశ్వబ్రాహ్మణులు అగ్నికులక్షత్రియులు, బ్రాహ్మణేతరులుగ లింగధారులు, వైష్ణవ మతస్వీకరణ గల కొన్ని కులములుగ ఈ ద్విజన్మఉపనయన సంస్కృతిగ చెప్పబడే యజ్ఞోపవీతధారణ కలిగి ఉన్నారు. వారికి ఉపనయనముగ ప్రత్యేక ప్రాధాన్యత కులాచారముల ప్రాచుర్యముగ చెప్పబడలేదు.

అయితే ద్విజ శబ్దము మాత్రము బ్రాహ్మణ సామాజిక ముద్ర రూఢార్ధము. బ్రాహ్మణ సామాజికముగ వర్ణవ్యవస్థలో పురోహితుడుగ ఉపనయనము లేదా శుభాశుభ కర్మకాండలు చాతుర్వర్ణ వ్యవస్థకు కులాచారముల బట్టి జరిపించుటకు సుమతీ శతకము పేర్కొన్న ద్విజుడు(లు)గ ఎక్కువమందికి అవసరమైన పదము ఆమోదము.

ద్విజము అంటే పక్షి. ద్విజన్మము గలది. గ్రుడ్డుగ అచేతనము ఒక జన్మ. గ్రుడ్డు నుండి చేతనముగ రెక్కలొచ్చి ఎగరిపోవడం మరో జన్మ. మన భారతీయ సంస్కృతిలో బ్రాహ్మణులు ద్విజులుగ ద్విజన్ములని పేరుబడ్డారు. బ్రాహ్మణ బాలుడు ఉపనయనము కానపుడు గ్రుడ్డు జన్మ. తరువాత ఉపనయనము జరిగి బ్రాహ్మణ సామాజిక బాధ్యతలుగ పురోహితుడుగ అర్హత ద్విజుడవుతున్నాడు. స్త్రీలకు ద్విజన్మ ఉపనయన సంస్కారము లేదు.

బ్రాహ్మణ కుల ఈ ద్విజన్మసంస్కారము ఉపనయనము. చాతుర్వర్ణ వ్యవస్థలో కొందరికి కులనామముగ ధ్వనించే బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య శాబ్దికముగ బ్రాహ్మణేతర శూద్రకుల శబ్దములున్నాయి. కొందరు ఈ ఉపనయన చిహ్న జందెము ధరిస్తున్నారు. కాని వీరికి ద్విజ లేదా బ్రాహ్మణ కులశ్రేష్ఠము వర్తింప బడదు. వారివారి కులానుగత వేదనిర్ణయ ధర్మానుసరణ వృత్తులవలన బ్రహ్మ శబ్ద అధికార సిద్ది వస్తుంది. కాని ఉపనయన సంస్కృతి మూడు కులాలు పాటించిన పాటిస్తున్న బ్రాహ్మణ వేదవిధి వేడుక మాత్రమే ప్రాచుర్యముగ చర్చకు నిలిచింది.

కాని, ధర్మానుసరణ అంటే గృహస్థాశ్రమాధికారము, కులోచిత విద్యాధ్యయనము, వేదాధ్యయనము, ధర్మశాస్త్రాధ్య యనాధికారముగ కులాతీతముగ లభించాలి. శ్రుతి మంత్రముల చేత చేయబడు సంస్కారముగ ఉపనయనము అవుతుందని పాల్కురికి సోమనాథుడు పండితారాధ్యాచరిత్రలో పేర్కొన్నాడు. వేదాధ్యయనము, మథూకరము అంటే భిక్షాటన బ్రాహ్మణ బ్రహ్మచారికి విద్యార్థిగ సమాజము గౌరవమైన స్థానముగ గురుకుల పాఠశాల విద్యార్హతగ ఉపనయనము. గురుశుశ్రూషగ ప్రాచీనమైనది. ఉపనయనము అంటే విద్యార్థిగ అర్హత జ్ఞానసాధనధర్మము.

ధర్మము అనగా యజమానుని మనస్సహితాత్మ యందు సంస్కార రూపముగ ధరింపబడు వేదధర్మానుసరణ గుణము. శ్రుతిస్మృతుల చేత విధించబడ్డ ధర్మానుసరణగుణ సంధ్యావందనము మొదలయిన అశ్వమేధ యజ్ఞవిధి పర్యంతము నిత్య నైమిత్తిక కామ్య త్రివిధ కర్మకాండ చతుర్వేదాధ్యయనము. కాని అష్టాదశ స్మృతి సంహితలు, ఉపస్మృతులు కూడ ధర్మానుసరణ అధికార ఆచార వ్యవహారాల ప్రాయశ్చిత్త కాండల చతుష్షష్టివిద్యలకు ధర్మశాస్త్రాధ్య యన గ్రంథములుగ పుట్టాయి. ప్రాచీన సద్గురు ముఖము సంప్రదాయ పూర్వకముగ చదువుకొని అభ్యసించుట ఏ కులము వారికైన తప్పనిసరి. ద్విజన్మఉపనయన సంస్కృతి లేదు. అందుచేత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యేతర కులేతరులకు అధికారాకాంక్ష వేదధర్మానుసరణ సిద్ధాంత వేదసమాన గ్రంథ రచనలు గురుశుశ్రూష ప్రాచీన విద్యార్థికి సహకరించడానికి పుట్టాయి.

అగ్రకులాలకు కూడ ఇప్పుడున్న విద్యావిధానమునకు చతుర్వేదవేదాధ్యయన ద్విజార్హత వేదపాఠశాలలకు తప్ప ఉపనయన సంస్కారము అవసరము లేదు. నేడు వేడుకగ అనువంశిక ఉపనయనమునకు పరిమితమైన ఆహ్వానముగ ఆచారము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులములకు వివాహ యోగ్యతాపత్రంగ తప్పనిసరిగ ఉంది.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఒకప్పటి గురుశుశ్రూష సంప్రదాయ వస్త్రధారణ వేడుకలు ఉపనయనము. ఎనిమిదో యేట ఉపనయనము జరిపేవారు. బ్రహ్మోపదేశముగ గాయత్రీ మంత్రము తండ్రి నుంచిలేక అర్హత కలిగిన వ్యక్తి నుంచి ఉపదేశము పొందాలి. విద్యార్థిగ అర్హత కలిగిన బ్రహ్మచారిగ అనిపించుకుని విద్య సముపార్జించి రావాలి. వచ్చాక వివాహము చేసుకుని గృహస్థాశ్రమ విధి పాటించాలి. వడుగు అంటారు. బ్రహ్మచారి అని పిలవబడతాడు.

బ్రహ్మచారికి, గృహస్థాశ్రమ ధర్మానుసరణ వడుగు నాడె బోధించడము జరుగుతోంది. దీనిని నిత్యకర్మగ 1.స్నానము 2.సంధ్యావందనము 3.జపము 4.పూజ 5.ఔపోషణ అగ్నిహోత్రము తప్పనిసరిగ చేయాలన్నది ఉపనయన సంస్కృతిగ నియమము. కాశీఖండము గుణనిధి కథలో యజ్ఞదత్తుడు వీటన్నిటికి దూరమైన కొడుకు గుణనిధి ప్రవర్తనని తలచుకుని భార్యను నిందిస్తాడు. “స్వాధ్యాయమెన్నండు చదువంగబోకుండ బోలునే చదువంగబోయెననుట..” ప్రసిద్ధ పద్యముగ బ్రాహ్మణ కులఈ ఆచార ధర్మములు ప్రస్తావన ఉంది.

ముఖ్యంగ యఙ్ఞోపవీతము. దీనికి జందెం, జందియం జంధ్యం అనిపేర్లు. మూడు కులాల వారు వేదాధ్యయ నాధికారము, పితృకర్మ అర్హతకు ఉపనయనము నాడు ఈ యజ్ఞోపవేతము ధరించి అర్హులవుతారు. ప్రతి జంధ్యానికి మూడు పోగులు. ఒకముడి చేత కట్టబడి బ్రహ్మ గ్రంథి అని పిలువబడతాయి. పోగు సాధారణ వ్యక్తి ఎత్తుకు సమానంగ ఎడమ మెడమీద నుంచి కుడిప్రక్కకు కటి ప్రదేశము వరకు వేసుకుంటారు. ఉపనయనము నాడు ఈ పోగు ధరించి యజ్ఞార్హత పొందుతారు. ఈ యజ్ఞార్హత వటువు వేషధారణ నేడు కూడ గమనించదగ్గది.

వటువుగ బార సాలవేడుక జ్ఞాపకము, చౌలము అంటే పుట్టు వెండ్రుకలు తీయించి పంచశిఖాధారణగ అంగవస్త్రము ధరించిన కపట బ్రహ్మచారి అవుతాడు. తరువాత సుమూహుర్తముగ అసలైన యఙ్ఞోపవీతము ధరించి బ్రహ్మోపదేశము పొంది దండము ధరించుట ఆచారము. ఇప్పుడున్న పురోహిత తంతుగ ఆధునిక ఉపనయన సమయము బంధుమిత్ర ఆశీస్సుగ గురుకుల విద్యార్హతగల చతుర్వేద ఆచారానుకరణ జ్ఞాపకము చేసుకుంటున్నారు.

వటువుగ ధరించిన దండము బెరడు తీయని సన్నని పొయ్యి కట్టెలా ఉంటుంది. మారేడు లేదా, మోదుగ విప్రకుమారుడు, వటములేదా ఖదిరము రాజకుమారుడు, రావి లేదా మేడి దండము ధరించి వైశ్యబాలకుడు భవతిభిక్షాందేహి నాటి విద్యార్థిగ నేటికాల విద్యార్థి బ్రహ్మచారి ఉపనయనము బంధుమిత్ర సపరివార సందోహం ఆశీశ్శుభ సమయముగ ధరించాలి. ఏ వయసులో ఉపనయనము చేసుకున్నా బాల్యకౌమారయవ్వన పయన మహోన్నతాశీస్సుల శతమానంభవతి గృహస్థాశ్రమ సోమయాజిగ అది దారి. యజ్ఞ కర్మ అధికార సిద్ధి.

యజ్ఞము చేసిన వాడు సోమయాజి. తిక్కన మహాకవి సోమయాజి అనిపించుకోడానికి యాగపశువుగ మేకను బలిచ్చి యాగంచేసాడు.?!. ఉపనయనము రోజున ఈ వేడుకలో వటువు చేత మేక, గొఱ్ఱె తోలు జందెము తరతరాల నాటిది దాచినది పురోహితుడుగ జ్ఞాతమును ఉత్తరీయముగ ధరింపజేస్తారు. నిషిద్ధ బలి యజ్ఞ అధికార బ్రాహ్మణత్వ సోమయాజిగ ఆధునిక పరిస్థితుల కనుగుణముగ యజ్ఞార్హత తృప్తి గృహస్థాశ్రమదారి వేడుక ఉపనయనము నాడు తప్పనిసరి. ముంజగడ్డిలేదా దర్భగడ్డితో చేసిన ముప్పేట మొలత్రాడు ధారణ మధూకర వృత్తి అనుకరణ వేషధారణ ముచ్చట గొలుపుతుంది.

ఇది ఎనిమిదోయేట జరగాలి. ఆచరణ సాధ్యమైన బాధ్యత తీసుకున్న వారు లేకపోలేదు. ఆడుకోవాల్సిన వయస్సు కాన్వెంటు కార్పొరేట్ విద్యాసంస్థల చదువుల పట్ల భారము వెనుకంజ వేయిస్తున్న కారణముగ వయోపరిమితి వివాహ సమయవయసు వేడుకగ మారుతున్న వాతావరణ పరిస్థితుల కనుగుణముగ ఉపనయన వేడుక సంప్రదాయ అవశేషముగ బ్రాహ్మణ, క్షత్రియ వైశ్యకులాచారముల ఉపనయన వయోపరిమితి తప్పనిసరయింది.

జన్మించిన సంవత్సరము మొదలు 8 నుంచి 16 సంవత్సరాల లోపల బ్రాహ్మణ బాలకుడు ఉపనయనము చేసుకోవాలి. 11 నుంచి 22 సంవత్సరము పూర్తవకముందు క్షత్రియ బాలకుడు, 12 నుంచి 24 వత్సరములు నిండకుండ వైశ్య బాలకుడు వడుగు చేసుకోవడం శాస్త్ర సమ్మతము. కాని వివాహ సమయానికి మాత్రము తప్పనిసరిగ వడుగు చేసుకోవాలి. వడుగుకు ఉపనయనము అని పేరు. అందుచేత ప్రత్యేక వేడుకగ కూడ వయోపరిమితి ఆవశ్యకత సంప్రదాయము లేకుండ కూడ జరుపుతున్నారు.

అయితే సప్తతి వయసున్న తాతలు ఉత్సాహపూరిత ప్రోత్సాహక ప్రతిపాదన వల్ల 8వ ఏటనుంచీ ఉత్సాహపూరిత ఉపనయన వేడుకలు జరిపిస్తున్న బాలబ్రహ్మచారి వేడుకలు నేడు ఎక్కువ అయాయి. పురోహితుడుగ వృత్తి స్వీకరించే బ్రాహ్మణ శాఖలలో 8వ యేట ఉపనయనము తప్పని సరి.

బ్రాహ్మణేతరులుగ అగ్నికులక్షత్రియులు, విశ్వబ్రాహ్మణులు, మరికొన్ని ఇతర కులాలు ఉపనయన చిహ్నము జందెము కలిగి ఉన్నసంస్కృతి శైవ, వైష్ణవ మతస్వీకరణ బ్రాహ్మణేతరులలో విజృంభించిన కాలము నుంచి నిలిచిఉంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఉపనయన పద్ధతికి భిన్నమైనది కావచ్చు. కాని ఉపనయన చిహ్న జందెము వృత్తికులాచార ధ్రువీకరణ విషయముగ ఉపనయన చిహ్న కులధర్మానుగతమైన చతుష్షష్టివిద్యల వేదవిద్యార్హతగ జందెము ధరిస్తారు. ధర్మశాస్త్రాధ్యయన ప్రాధాన్యత అర్హత జ్ఞానసాధన ఇతర కులోచితము ఉంది.

జంధ్యాల పౌర్ణమిగ శ్రావణ పూర్ణిమ రోజున జంద్యాలపండుగగ యజ్ఞోపవీతధారణ అధికారముగల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులములే కాక బ్రాహ్మణేతరులుగ జందెం, జంధ్యము, జందియం పేర్లమీద యజ్ఞోపవీతమును ధరించిన కులములున్నాయి. శిల్పాలు వైద్య మొదలయిన కళలు ఉపవేదముగ ఉన్న వివిధ విభాగాల వేద అష్టాదశ ఉపవిద్యల అధ్యయనమునకు కూడ శ్రుతిమంత్రముల అవసరముంది. ఈ సంస్కారము ఉపనయనము అవుతుందా? విచారణీయము.

పాల్కురికి సోమనాథుడు పండితారాధ్యాచరిత్రలో ఉపనయనము గురించి చెప్పాడు. వేదాధ్యయన సంప్రదాయ ప్రస్తావనగ ఉపనయనము గురుశుశ్రూష ప్రాచీన వేడుక. మూడు కులాలు వేడుకగ మాత్రమే నేడు గృహస్థాశ్రమదారి బ్రహ్మోపదేశముగ వేడుకది. ఏ కులముపట్ల అగ్రవర్ణాల భావన అలంకారముగ పోలిక పెట్టలేము.

అష్టాదశ విద్యలు వేదనిర్ణయ ధర్మానుసరణ అధికార ద్విజన్మఉపనయన చిహ్నము జందెము ధరించుట జంధ్యాలపౌర్ణమి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఉపనయన చిహ్న ముద్ర వేసుకున్న వేదవిద్యలో ద్విజుడు మాత్రమే ప్రాచుర్యముగ వేదవిద్య అభ్యసించుట వలన బ్రహ్మజ్ఞాన బ్రహ్మ ర్షి అయ్యాడు. తరువాత క్షత్రియ వైశ్యులలో రాజర్షిగ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవడానికి ప్రయత్న కథ ఉంది. పోతులూరి వీరబ్రహ్మంగారు మొదలయిన స్వాములు బ్రహ్మ జ్ఞానము అన్నికులములకు ఉందని నిరూపించారు.

చతుర్వేదాధ్యయనము పురోహిత కులములుగ బ్రాహ్మణ సామాజిక బాధ్యతగ అధికార బ్రాహ్మణత్వ సోమయాజిగ ఉపనయన వేడుక ద్విజన్ములది. అగ్రవర్ణాల అనువంశికమయింది. ఏకచచక్రపురంలో క్షత్రియత్వము దాచుకుని బ్రాహ్మణ వేషధారణతో పాండవుల జీవనవిధానము బ్రాహ్మణ సామాజిక ముద్ర పడిన ఔచిత్యము నిరూపణ చేసింది. జందెము బ్రహ్మ ప్రసాదముగ బ్రహ్మత్వ సిద్ధినిచ్చినా బ్రాహ్మణ సామాజిక కులాచారముల వారసత్వ ముద్ర మనఃస్ఫూర్తిగ అందరికి అంగీకారము రాలేదు. ఉపనయన ఆవశ్యకత సంప్రదాయ ప్రస్తావన వేడుకగ మూడు కులాచారముల అగ్రవర్ణాలకు ధర్మానుసరణము వేదసమ్మతముగ నిలిచింది.

కాల్పనిక కాలముగ భావన చాతుర్వర్ణ వ్యవస్థ కులాచారములలో అగ్రవర్ణాలకు అహంకారముగ కలగకూడదు. బ్రహ్మచర్య దీక్ష తరువాత గృహస్థాశ్రమ స్వీకరణ సంప్రదాయ వేడుక సంస్కృతిగ ఆదర్శము యజ్ఞోపవీత ధారణ ఉపనయన వేడుక. తరతరాల ఈ మూడు కులాల సంప్రదాయము గౌరవింప బడాలన్నది ఆకాంక్ష.

Exit mobile version