డా. భీంపల్లి శ్రీకాంత్‌కు ఉత్తమ సాహితి ప్రతిభా అవార్డు – ప్రెస్ నోట్

0
2

[dropcap]పా[/dropcap]లమూరు జిల్లా ప్రముఖ కవి, రచయిత, పరిశోధకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ కు జిల్లా స్థాయి ఉత్తమ సాహితి ప్రతిభా అవార్డు లభించింది.

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం ఆధ్వర్యంలో బెల్లం సత్యమ్మ స్మారక ట్రస్ట్ వారిచే నవంబర్ 24 న ఆత్మకూరు సంస్థానాధీశుల వారసులు రాజా శ్రీ రాంభూపాల్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, ఆలయ కార్యనిర్వాహణాధికారి మదనేశ్వర్ రెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు, ప్రముఖ కళాకారులు బెల్లం సాయిలు, కాళోజీ పురస్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, విశ్రాంత జి.హెచ్.ఎమ్.సి అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here