ఆటోమొబైల్/వాహన రంగంలోని వారి కథల సంకలనం కోసం ప్రకటన

0
2

[dropcap]న[/dropcap]మస్కారం.

గుఱ్ఱాల లక్ష్మీ ప్రసాద్ ఫ్యామిలీ ట్రస్ట్ వారు ఆటోమొబైల్/వాహన రంగంలో ఉన్న శ్రామికులు, సిబ్బంది జీవితాలు, వృత్తి పరంగా సాధకబాధకాలు ముఖ్యాంశంగా గల కథలతో సంకలనం తేవాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యం మీద మీ ఎరుకలో ఉన్న కథల వివరాలు తెలియపరచి సహకరించ వలసిందిగా అభ్యర్థిస్తున్నారు. అవకాశం ఉంటే ఆ కథల కాపీలను దయచేసి పంపగలరు. లేకుంటే, ఆ కథలు ఎక్కడ లభ్యమో, ఏ సంకలనంలో ప్రచురించబడ్డాయో తెలియజేసినా వాటిని సంపాదించే ప్రయత్నం చేస్తారు.

దిన వార పత్రికలలోకానీ, కథా సంపుటాలలో కానీ, బ్లాగులు, అంతర్జాల పత్రికలలో కానీ, ఇతర సంకలనాలలో ప్రచురించబడిన కథల సమాచారం కూడా పంపవచ్చు.

రచయితలు, వారి పరిచయస్థులు ఎవరయినా పంపవచ్చు.

“సంకలనంలో చేర్చుకుందుకు అభ్యంతరం లేదు” అన్న హామీపత్రం తప్పనిసరిగా ఉండాలి.

నేటి కాలంలో వాహనం సహజ అవసరంగా ఉంది.

చాలామందికి ఏదో ఒక వాహనం తప్పనిసరిగా ఉంటుంది.

అలా నేర్చుకునేటప్పుడో, నడిపేటప్పుడో మీ వాహనంతో మీ అనుభవాలు, అనుభూతులు హాస్యంగా అయినా వ్రాసి పంపండి. దీర్ఘప్రయాణాలు చేసే వారి అనుభవ చిత్రణలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.

వాహనదారులకు అవసరమైన లైసెన్సులు, ఇతరం పొందే సమయంలో ఎదురుకున్న సంఘటనలు కూడా మంచికథలు కాగలవు.

ఆ సిబ్బంది గురించి మీరు గమనించినవి చిన్నకథలుగా మలచవచ్చును కూడా.

సంకలనానికి కొత్తగా వ్రాసి పంపేవాటికి ఇతోధిక పారితోషికం ఉంటుంది.

అరుదైన కథాంశంతో రూపొందిస్తున్న ఈ పుస్తకానికి రచనలు పంపి సహకరించవలసిందిగా అభ్యర్ధిస్తున్నారు.

కథల స్వీకరణ/తిరస్కరణ నిర్ణయ బాధ్యత పూర్తిగా ట్రస్టు వారిదే. గడువు 01.12.2021 వరకు.

కథలు పంపవలసిన మెయిల్ ఐడి guralavimala@gmail.com

ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here