[శ్రీమతి శాంతిలక్ష్మి పోలవరపు రచించిన ‘వాణి గల బ్రహ్మ..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]పై[/dropcap]న ఏదైనా కానీ
అది మిన్నైనా మన్నైనా
అంతరం సొంతమై ఉండాలి..!!
ఒరవడి తనను కరచుకు పోయినా ..
నది తన పరుగును ఆపేదే లేదు.!! మరింత విశాలం..
మరింత వికాసమై పరుగిడటం తప్ప మరో పని లేదు..!!!
అక్షరాలు బహు తక్కువ..!!
పదశిల్పుల చేతుల్లో అవి
మనోదర్పణాల్లో మెరిసే వేల శిల్పాలై నిలబడతాయి..!!
కవులనే ..మనో యౌగికులు
అక్షర చిత్రాలు వేసే మాయా
మాంత్రికులు..!!
ఏ అక్షరం ఎక్కడ సర్దేస్తారో..
ఎవరూ ఎరుగనే లేరు..!!!
పదవన వికాసాల తో మనసులు పావనం చేస్తారు..!!
గంధమెరుగని సుగంధ మాలలు చేస్తారు..!!!
మనసుకు పరి పరి విధాల పరిమళమద్దేస్తారు..!!!
నింగిలోని మేఘం ..నేలపై నదిలా ప్రవహించే
గాడిలో ఒరవడిలా..
వారి మేధో గంధం ..అక్షర పూతోటలో పూలై పూస్తాయి..!!
అయితే విత్తనమది చదివిన వారి హృదిలో మొలుస్తుంది..!!
ఇది కదా వింత..!!
మయూర.. మాధ్యమంలా..!!
అదికదా ..వాణీ వాహన విలాసం..!!!
శిరమున పింఛము దాల్చెడి వరమును పొందిన వాడైన కవి ..పరివేష్ఠిత కాంతుల..
కమల వికాస ..తరంగిత పద ఘటములు గల ఘంటము తనదైన వాణి గల బ్రహ్మ.!!!