[dropcap]”దే[/dropcap]వుడు ఎట్ల ఉనికిలాకి వచ్చెనా?”
“దెయ్యము వచ్చినట్లరా”
“దెయ్యము ఎట్ల వచ్చెనా”
“దేవుడు వచ్చినట్లరా”
“ఇద్దరిది ఒగే వాటమేనా?”
“ఊరా”
“సరే! నువ్వెట్ల ఉనికిలాకి వస్తివివా?”
“నువ్వొచ్చినట్లరా”
“అంటే మనది అదే వాటమేనా?”
“మనదే కాదు అందరిది అదే వాటమురా”
“మడి, ఇబుడు ఎట్లనా?”
“ఎట్లాలే గిట్లాలే అందరిది అదే వాటమే. ఆ వాటము ఏమని మనము తెలుసుకోవాలరా”
“అదెట్ల తెలుసుకోవాలనేది రవంత చెప్పనా”
“బుర్రకి పని చెప్పాలరా. మంచి ఎన్నముతో (మనసు) ఆలోచన చేయాలిరా… అనంతం మన ముంద్ర వుందిరా… ఓ అవకాశం మనకు అందిందిరా… ఆలోచిద్దాం… ఆచరణలాకి వద్దాం… రా”
“సరేనా”
~~
అన్న చెప్పింది అక్షరాలా నిజం.
ఆలోచిద్దాం! ఆచరణలాకి వద్దాం!
రండా! రారండ!
***
వాటము = సూత్రము