Site icon Sanchika

వచ్చింది వచ్చింది దసరా

[box type=’note’ fontsize=’16’] విజయదశమి పండుగ సందర్భంగా నయా రాక్షసులను తరిమికొట్టాలంటూ ప్రత్యేక కవితని అందిస్తున్నారు శంకరప్రసాద్. [/box]

[dropcap]వ[/dropcap]చ్చింది వచ్చింది దసరా
తెచ్చింది మంచికి ఆసరా
చెడుపై మంచికి విజయం
కలి కాలంలో కూడా ఉంటుంది
నవరాత్రులలో నవ జవం ఇచ్చి
నవ జీవనానికి నాంది పలికింది

ముష్కర రక్కసుల వధ
జరిగింది యుగాల వెనుక
నేడు జరగాల్సింది మాత్రం
నరుల ముసుగులు వేసుకుని
పరులను పరి విధముల పీడిస్తూ
స్వార్ధం, మోసం, ద్రోహాలతో
నయవంచన చేయు నయా రాక్షసులు
తరిమి కొట్టండి తురిమి వేయండి
నవరాత్రులను నవ చైతన్య దినములగ
మార్చండి, మీరు మారండి, రండి..

Exit mobile version