Site icon Sanchika

వాడిక

[dropcap]”నీ[/dropcap]కి ఎన్ని కితాలు (సార్లు) చెప్పేది చిన్నా ఇట్ల చెయ్యొద్దని” అంటా బిడ్డకి బుద్ధి చెప్పే అమ్మ.

బుద్ధి మాటలు వింటే అది బిడ్డ ఏమిటికి అవుతుంది? చిన్న బిడ్డ ఎట్లవుతుంది? చేసిందే చేసే.

అది చూసి అబ్బకి రేగిపోయ. “ఎం? వాడికరా నీది” అంటా బిడ్ద చెంప మీద ఒగటిచ్చె (దెబ్బ).

బిడ్డ ఏడిస్తా వుంది.

అమ్మ బిడ్డని సుదారిస్తా, అబ్బని గదమాయిస్తా వుంది.

అయినా బిడ్డ ఏడుపు నిలపకుండా ఏడస్తానే వుంది.

అబుడు అబ్బ “చిన్నా మొన్న కడ్డి అయిస్ క్రీము కావాలంటివి కదా తీసిస్తా (కొనిపెడతా) రా” అనె.

అంతే బిడ్డ ఏడుపు నిలిపి అబ్బ తాకి పారే.

***

మన్నించే గుణం

అబ్బ అమ్మకే కాదు

బిడ్డకూ వుంది.

బిడ్డని బిడ్డగా ఎదగనిస్తే

వాళ్ళకి అట్ల బదుకు మనమిస్తే.

***

వాడిక = అలవాటు

Exit mobile version