Site icon Sanchika

‘వైకుంఠపాళి’ – కొత్త ధారావాహిక – ప్రకటన

[dropcap]తె[/dropcap]లుగువారి అభిమాన రచయిత్రి ‘బలభద్రపాత్రుని రమణి’ రచించిన ‘వైకుంఠపాళి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.

***

మాళవికకి మొదటిసారి తెల్సింది కీర్తితో పాటు రచనల ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు అని!

మాళవిక ఆ తర్వాత వరుసగా కొన్ని కవితలు వ్రాసి అన్ని వారపత్రికలకి పంపించింది. పంపించిన రోజు నుంచీ అవి ప్రచురింపబడి తన కొచ్చే పారితోషికం కోసం ఆశగా ఎదురుచూడసాగింది. కానీ… అవన్నీ భద్రంగా ఆమెని వెతుక్కుంటూ తిరిగొచ్చాయి.

మాళవిక నిరాశపడలేదు. అవి తీసుకుని ఓ పత్రికాఫీసు కెళ్ళింది.

అందరూ సీరియస్‍గా పని చేసుకుంటూ కనిపించారు.

ఓ ముసలాయిన రిటైర్మెంట్‍కి దగ్గర వున్నట్లు కనిపిస్తున్నాడు. తాపీగా చెవిలో అగ్గిపుల్ల పెట్టుకుని తిప్పుకుంటూ కూర్చుని వున్నాడు.

మాళవిక ఆయన దగ్గరకు వెళ్ళి “నమస్కారం” అంది.

***

తెలుగులో ఇంకా అచ్చు పత్రికలు సజీవంగా వున్న కాలం, రచయితల్లో రచనలు చేయాలన్న తపన, దీక్షలు ఇంకా వున్న కాలాన్ని కళ్ళముందు నిలిపే నవల…తప్పక చదవండి…గతాన్ని వర్తమానంలో అనుభవించండి.

ఈ సరికొత్త ధారావాహిక… సంచికలో… త్వరలో.

Exit mobile version