[box type=’note’ fontsize=’16’] “మత్తుకు తోడు మసాలా వడలు వక్తకి తోడు వందిమాగధులు” అని చెబుతూ, “నల్ల నీళ్ళ పవరు తెల్లరితే హరీ!” అంటున్నారు భువనచంద్ర ‘వక్త-4’లో. [/box]
“బలవంతుడిదే బతుకు
బలహీనుడికే బలుసాకు
కండ ఉన్నోడే కార్యశూరుడు
ధనం వున్నోడే దేవతాముర్తి!
జగమెరిగిన బ్రాహ్మణునకు
జంధ్యమేలా?
బ్రతుక నేర్చినవానికి బెదురేలా
భయమేలా?”
“ఆహా, ఏమన్నారూ!”
శిష్యుల మెచ్చుకోలు.
“నా వాక్కే విజ్ఞానం”
వక్తగారిలో ఉత్సాహం.
చల్లని రాత్రిలో వెచ్చని గాడ్పులు
తెల్లని గ్లాసులో నల్లని ద్రవాలు
మత్తుకు తోడు మసాలా వడలు
వక్తకి తోడు వందిమాగధులు
కోడి కూసే వేళకి
కోతలు పూర్తయ్యాయి.
ఇక్కడ గ్లాసులు ‘ఛీర్స్’
అక్కడ పెళ్ళాల ‘ఛీ… ఛీ…’లూ
మన్నుతిన్న పాములా
మంది మింగిన వక్త
కక్కుకునే శక్తి లేక
కాళ్ళు బారజాపాడు
దాసుడి తప్పు
దండంతో సరి
నల్ల నీళ్ళ పవరు
తెల్లారితే హరీ!