[box type=’note’ fontsize=’16’] తెలుగు విశ్వవిద్యాలయంలో సురభి కళాకారుల నాటక ప్రదర్శన చూసాక కలిగిన స్పందనని కవితాత్మకంగా ప్రకటిస్తున్నారు గొర్రెపాటి శ్రీను. [/box]
[dropcap]స్వ[/dropcap]ప్రయోజనాన్ని ఆశించకుండా కళే జీవితంగా బ్రతికే కళాకారులు!
స్టేజ్ పైకి ఎక్కగానే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి…
తాము ధరించిన పాత్రను రక్తికట్టించే… ప్రేక్షక జనరంజకులు!
వీక్షకులు వేసే విజిల్స్, కొట్టే చప్పట్ల కు పొంగిపోయి…
ప్రజల ప్రశంసలే… వెలకట్టలేని విలువైన ఆస్తులుగా భావించే అమాయకులు!
రంగస్థలంపై మాత్రమే నటించడం తెలిసిన వాళ్ళు…
నిజజీవితంలో నటనకు చోటివ్వని నిష్కల్మష హృదయులు!
వాళ్ళే సురభి నాటక కళాకారులు!
సినిమాలు, టీ.వి లు వచ్చాక…
ఉనికిని కోల్పోతూ…
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న “నాటకానికి ”
పునర్వైవైభవం తీసుకురావాలన్న ఆశతో…
ఆ ప్రయత్నాలతో తమ జీవితాలనే పణంగా పెట్టి…
“నాటకం” గొప్పతనం ప్రపంచం తప్పకుండా మళ్ళీ తిరిగి
గుర్తిస్తుందన్న నమ్మకంతో బతుకుపయనం సాగిస్తున్న ఆశాజీవులు!