[box type=’note’ fontsize=’16’] ప్రకృతి కథలలో భాగంగా వానల గురించి, వర్షాలెలా పడతాయో బొమ్మలు గీసి పిల్లలకి సులువుగా అర్థమయ్యేలా కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]
“మా చిన్ని నేస్తమా! మేము ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రయాణిస్తున్నాము. నీలాంటి చిన్ని నేస్తాలను, రైతులను, ప్రజలను, ప్రాణులను పలకరించి వస్తున్నాము” అన్నాయి వాన చినుకులు.
“తెలీదు. ఎలా? చెప్పండి. ప్లీజ్” అంది ప్రకృతి.
“విను. మేము అంటే వాన చినుకులం. మమ్మల్ని నీరు అని కూడా అంటారు. ఈ భూమి మీద అనేక రూపాల్లో ఉన్నాము.”
“అంటే ఎలా?” అంది ప్రకృతి.
మాలాగే లెక్క లేనన్ని నీటి చుక్కలు నీటి ఆవిరిగా మారి ఆకాశంలో కదులుతున్న మబ్బుల్లోకి చేరుతాయి.
తిరిగి నదులు, చెరువులు, సముద్రాలూ, నేల పొరల్లోకి చేరుతాము. దీన్ని వర్షపాతము లేదా వాన కురవటం అంటారు.
మా చిన్ని నేస్తం ప్రకృతీ! ఈ మా ప్రయాణాన్ని వాటర్ సైకిల్ అంటారు. భూమి పై కురిసే వాన నీరు చాలా ఉంటుంది. కానీ తాగటానికి దొరికే పనికి వచ్చే నీటి శాతం ఒక్క శాతం మాత్రమే.
వర్షపాతం అన్ని చోట్ల ఒక్కలా ఉండదు. అందుకు అనేక కారణాలు. వాటిలో కొన్ని అడవులు నరికివేసిన చోటులో వాన సరిగా పడదు. అందుకే అడవులను పెంచాలి. నీరు ఆవిరి అయిన చోటే వాన పడుతుందని ఖచ్చితంగా చెప్పలేము.
నీటి లభ్యత తక్కువగా ఉండటంలో మరో కారణం మీరు అదే మనుషులు… నీటిని వివిధ రకాలుగా కలుషితం అంటే మురికి చేస్తారు. చెరువుల్లో జంతువులూ కడగటం, బట్టలు ఉతకటం, ఫ్యాక్టరీల వ్యర్ధ, మురుగును నదులు, కాలవలు, భూమిలోకి వదలటంతో నీరు పాడై మనుషులు, జంతువులూ చెట్లు, పక్షులకు పనికి రాకుండా పోతున్నది.
అంతే కాదు, నీటిని వృథాగా పరబోయటం కూడా ఎక్కువే. మానవ తప్పిదం వల్ల మీరే కాదు భూమి, ప్రాణులకు ప్రాణ సమానమైన నీటిని నాశనం చేస్తున్నారు.
మీకు తెలుసా, ఆఫ్రికా దేశాలలో నీటి కోసం ప్రజలు చాలా దూరం వెళ్తున్నారు. ఆసియాలో కూడా అంతే.
చిన్ని నేస్తమా! మీ తరమైనా మమ్మల్ని పొదుపుగా వాడి ప్రకృతిని కాపాడండి. నీటిని పొదుపుగా వాడి, శుభ్రపరచి, తిరిగి వాడుకొని ఆనందంగా ఉండండి. భూమి మీద హక్కు మనుషులు ఒక్కరికే కాదు. ఇతర జీవులకూ ఆ హక్కు ఉంది. మీరు జీవిస్తూ, ప్రకృతిలో భాగమైన ఇతరులనూ బ్రతకనివ్వండి.
ఓహ్! మాటల్లో పడిపోయాము. ఆహ్! వాతావరణం వేడేక్కుతున్నది. మా ప్రయాణం మళ్ళీ మొదలు అయ్యింది. బై! ప్రకృతీ” అని వాన చినుకులు ఆవిరిగా మారి మబ్బుల్లోకి వెళ్ళాయి.
“బై! ఫ్రెండ్స్. మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలవాలని అనుకుంటున్నా. సీ యూ సూన్” అని వీడుకోలు పలికి వాన చినుకులు చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ వానలో తడిసిన ప్రకృతి అమ్మ పిలుపుతో ఇంట్లోకి వెళ్ళింది.